న్యూడ్ సెల్ఫీపై విమర్శ.. న్యూడిటీతోనే రిటార్ట్

Update: 2016-03-10 07:30 GMT
ఈ జనరేషన్ లో ఇది తప్పు అంటే వినేవాళ్లు ఎవరున్నారు చెప్పండి. ఏ తప్పు చూపించి విమర్శించారో.. ఆ తప్పును మరింత పెద్ద స్థాయిలో చేసి ఏం చేస్కుంటారో చేస్కోండి అని సవాలు విసిరే తరం ఇది. అందరూ ఈ తరహా అని కాదు కానీ.. మెజారిటీ జనాలు ఈ తరహాలోనే ఉంటారు. హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ సంగతే తీసుకోండి. అమ్మడికి వలువలు విడిచేయడం అంటే మహా సరదా. ఆమె ఎన్నిరకాల క్లీవేజ్ షోలు చేసిందో.. ఎన్ని న్యూడ్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కిక్కిచ్చిందో లెక్కే లేదు. ఇలా ఈ మధ్య ఒక న్యూడ్ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కుర్రాళ్లను కవ్వించింది.

ఐతే ఆమె ఏం చేస్కుంటే మాకేంటి అని ఊరుకోకుండా కొందరు ఈ సెల్ఫీ విషయమై విమర్శలు గుప్పించారు. బెట్‌ మిడ్లర్ - క్లోహి మోరెట్జ్ - పీర్స్ మోర్గాన్ లాంటి సెలబ్రెటీలు ఆమె తీరును తప్పుబట్టారు. కిమ్ చీప్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని ఎద్దేవా చేశారు. ఐతే ఇలా తనను విమర్శించిన వాళ్లకు ఇంకా గట్టిగా రిటార్ట్ ఇచ్చింది కిమ్. మహిళా దినోత్సవం రోజు.. మరో నగ్న చిత్రాన్ని పోస్ట్ చేసి దానికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ ట్యాగ్‌ జోడించింది. ఏ ఫొటో అయినా పోస్ట్ చేసే స్వేచ్ఛ నాకుంది, మీరెవ్వరు ఇదడగడానికి అని సవాల్ విసురుతున్నట్లే ఉంది ఈ ఫొటో - ఆ హ్యాష్ ట్యాగ్ చూస్తుంటే. తన బ్రెస్ట్స్ - ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకున్న కిమ్ ఫొటో చూస్తే కుర్రాళ్లకు మాత్రం మహా కిక్కు వచ్చేస్తోందిలెండి. అందుకే వాళ్లంతా కిమ్ ను తిట్టిపోసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News