పెళ్ల‌యిన హాటీతో కుర్ర‌హీరో ఓపెన్‌ గా

Update: 2018-12-20 11:03 GMT
టీనేజీ బోయ్స్  తో మిడిలేజీ అందగ‌త్తెల ప్రేమాయ‌ణం గురించి నిరంత‌రం వేడెక్కే వార్త‌లొస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో 27ఏళ్ల అర్జున్ క‌పూర్ తో 40 ప్ల‌స్ మ‌లైకా అరోరాఖాన్ ప్రేమాయ‌ణం బాలీవుడ్ స‌హా అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు అలాంటిదే మ‌రో ప్రేమ‌. కొంత ఏజ్ గ్యాప్ తో త‌న‌కంటే పెద్ద వ‌య‌సున్న కిమ్ శ‌ర్మ‌ను ప్రేమిస్తున్నాడు ఓ తెలుగు హీరో. అత‌డు ఎవ‌రో పరిచ‌యం అవ‌స‌రం లేదు. భూమిక చావ్లా అండ‌దండ‌ల‌తో `త‌కిట త‌కిట` అనే సినిమాతో తెలుగువారికి ప‌రిచ‌యం అయిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే. అటు పై ప‌లు తెలుగు సినిమాల్లోనూ న‌టించాడు. బాలీవుడ్‌ లోనూ ఫాల్తాన్ లాంటి భారీ చిత్రంలో న‌టించి మెప్పించాడు. పాకిస్తానీ గాళ్ ప్రేమ‌లో ప‌డే కుర్రాడిగా వేరొక‌ ప్రేమ‌క‌థా చిత్రం `స‌న‌మ్ తేరి క‌స‌మ్‌`తో ఉత్త‌రాది వారిని మెప్పించాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే. నా ఇష్టం- అవును 2- ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించాడు ఈ రాజ‌మండ్రి కుర్రాడు.

అటు పై బాలీవుడ్ లోనూ ల‌క్ చెక్ చేసుకుని అక్క‌డా ఓ సినిమాతో విజ‌యం అందుకున్నాడు. కానీ భారీగా ఆశ‌లు పెట్టుకున్న ఫాల్తాన్ ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం మైన‌స్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాపైనా అప్పుడు ప‌రిచ‌య‌మైన కిమ్ శ‌ర్మ‌తో స్నేహం మాత్రం దిన‌దిన ప్ర‌వ‌ర్ధ‌మానంగా వెలిగింది. ఆ క్ర‌మంలోనే ఆ జంట ప్రేమ‌లో ప‌డ‌డం, అటు పై చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేయ‌డం వాడి వేడిగా చ‌ర్చ‌కొచ్చింది.  ప్ర‌స్తుతం ఈ జంట ప్రేమాయ‌ణం బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఆ ఇద్ద‌రూ ఎక్క‌డ క‌నిపించినా కెమెరా క‌ళ్లు క్యాప్చుర్ చేస్తున్నాయి. వేడెక్కించే ఫోటోల‌తో హీటెక్కించేస్తున్నాయి. కిమ్ ఇప్ప‌టికే కెన్యాకు చెందిన ఓ వ్యాపారిని పెళ్లాడి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌ తో ఎఫైర్ సాగించింది. ప్ర‌స్తుతం కుర్ర‌హీరో తో చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తోంది.

అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఉన్న‌ది ఏంటి? ఇదే ప్ర‌శ్న‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే ఓపెన్ అయిపోవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కొచ్చింది. అవును మేం ప్రేమ‌లో ఉన్నాం. ఈ విష‌యం గురించి చెప్పేందుకు నాకు సౌక‌ర్య‌మే అయినా త‌ను మాత్రం సౌక‌ర్య ంగా లేద‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మీడియాకు తెలిపాడు. త‌ను న‌న్ను అర్థం చేసుకుంది. ఎంతో నిజాయితీగా నా ఎఫ‌ర్ట్ ని ఇష్ట‌ప‌డుతుంది.. గౌర‌విస్తుంది. అది న‌న్ను ఎంతో సంతోషంగా ఉంచుతోంది.. అని తెలిపాడు.  మొత్తానికి కిమ్ లోని క్వాలిటీస్‌కి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప‌డిపోయాడ‌ని అత‌డి మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News