మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా గత మూడు రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న దర్శకరత్న, దాసరి నారాయణరావు కు సంబందించి హెల్త్ బులెటిన్ ను వైద్యులు బుదవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆస్పత్రి ఎండీ భాస్కరరావు.. దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ఆయనకు డయాలసిస్ చేశామని, మరో 24గంటలు అబ్జర్వేషన్ లో ఉంచామని చెప్పిన వైద్యులు బుదవారం డయాలసిస్ చేయాల్సిన అవసరం పడలేదని, చేస్తున్న చికిత్సకు దాసరి స్పందిస్తున్నారని, బాగానే రికవరీ అవుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా వైద్యుల అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు... దాసరి నారాయాణ రావుకి వైద్యులు చాలా రిస్కీ ఆపరేషన్ చేశారని, వైద్యులు కూడా ఊహించని రీతిలో అది ఇంప్రూవ్ మెంట్ జరిగిందని, ఆయన ఆరోగ్యం కచ్చితంగా బాగుంటుందని, ఈ క్రమంలో దాసరి గారి ఆరోగ్యం బాగుండాలని గురువారం తాను షిరిడీకి వెళ్తున్నానని, అందరి ప్రార్ధనల సహాయంతో ఆయన త్వరలో కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు.
ఆస్పత్రిలో ఉన్న దాసరిని చూడటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపైనా, ఆరోగ్య పరిస్థితిపైనా డాక్టర్లతో మాట్లాడారు.
Full View