టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున ఆరు పదుల వయస్సు దాటినా యంగ్ హీరోలతో పోటీగా పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్నారు. ఓవైపు తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య - అఖిల్ లు హీరోలుగాసినిమాలు చేస్తుండగా.. మరోవైపు నాగ్ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు.
గత ముప్పై ఐదేళ్లుగా పరిశ్రమకు సేవలు అందిస్తున్న నాగార్జున.. ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. తన సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు.
కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు అందుకున్న నాగ్.. ఇప్పుడు తన 100వ చిత్రానికి చేరుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ అభిమానులు సైతం ఆయన మైల్ స్టోన్ మూవీ అనౌన్స్ మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ఏ డైరెక్టర్ చేతిలో పెడతారనేది తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు.
నాగార్జున వందో సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం ప్రముఖ దర్శకులతో చర్చలు జరుపుతున్నారంటూ పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే ఏదీ నిజం అవ్వలేదు. చివరగా 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు.
నాగ్ తో ఓ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు మోహన్ రాజా ఇది వరకే ధృవీకరించారు. ఈ క్రమంలో ఇదొక మల్టీస్టారర్ అని.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతుందని వార్తలు వచ్చాయి. నాగార్జున సైతం అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు చెప్పడంతో 'కింగ్ 100' సినిమాలో యూత్ కింగ్ కూడా ఉంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు.
అయితే నాగ్ ప్రస్తుతానికి తన నూరవ సినిమా కోసం ఏదీ ఖరారు చేయలేదని తాజాగా టాక్ వినిపిస్తోంది. 'ది ఘోస్ట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన తర్వాత తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పునరాలోచన చేస్తున్నారని అనుకుంటున్నారు.
నిజానికి నాగార్జున 'మనం' 'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' వంటి వరుస హిట్ల తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. కొత్త దర్శకులను విశ్వసించడం లేదా అవుట్ డేటెడ్ డైరెక్టర్లతో వర్క్ చేయడం వల్లనో అనుకున్న ఫలితాలు రాలేదు. 'బంగార్రాజు' చిత్రంతో హిట్టు కొట్టాడని అనుకుంటుండగా.. ఇటీవలి 'ఘోస్ట్' గట్టి దెబ్బేసింది.
ఈ నేపథ్యంలోనే నాగ్ తన తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కోవిడ్ తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ ఉండాలని భావిస్తున్నారట. ఫ్యాన్స్ మాత్రం తమ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ తో.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ మాస్ ఎంటర్టైనర్ చేయాలని కోరుకుంటున్నారు. మరి త్వరలోనే KING100 గురించి అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.