బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్నిగడుపుతున్నసంగతి తెలిసిందే. బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నా కోర్టు మంజూరు చేయలేదు. కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఇమేజ్ పై ఇది భారీగా ఇంపాక్ట్ చూపిస్తుందని మీడియా కథనాలు ఇప్పటికే హీటెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అనుకున్నదే నిజమైంది. షారుక్ ఖాన్ నటిస్తోన్న యాడ్ ని బోయ్ కాట్ చేయాలంటూ ఓ సెక్షన్ ఆడియన్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీపావళికి ఇంకా పది రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంలో `క్యాడ్ బరీ` కొత్త ప్రకటనతో ముందుకొచ్చింది.
ఈ సంస్థకు షారుక్ కొన్నాళ్లగా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. `నాట్ జస్ట్ ఏ క్యాడ్ బరీ` అంటూ యాడ్ ప్రసారం అవుతోంది. ఇందులో తమ స్థానిక దుకాణాల నుంచి వస్తువులు కొనుగోలు చేయాలని వీక్షకులకు షారుక్ విజ్ఞప్తి చేసారు. కరోనా పాండమిక్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారులు..బ్రాండ్లు తిరిగి పుంజుకుంటున్నాయి. కానీ చిరు వ్యాపారులు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గతం దీపావళి సమయంలో దెబ్బతిన్న చిరు వ్యాపారులను మేము ఆదుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం తమ వ్యాపారాలకు ప్రజలంతా సహకరించాలి`` అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ప్రకటనలో.
చిన్న దుకాణాల్లో బట్టలు..పాదరక్షకులు ఇతర వస్తువులు కొనుగోలు చేయాలని యాడ్ లో లైవ్ అవుతోంది. ప్రకటన ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ ఈ యాడ్ పై ఇప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ నిప్పులు చెరుగుతున్నారు. షారుక్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో వినయోగదారులంతా బోయ్ కట్ `క్యాడ్ బరీ` అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం #boycottcadbury ట్విటర్లో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే దీని పర్యవసానం అంత సులువుగా ఉండదని అంతా భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు షారూక్ తో ప్రకటనలు చేయడం అంటే అది సవాల్ లాంటిదేనని కార్పొరెట్ భావించేందుకు ఆస్కారం ఉంది. దీని పర్యవసానం కోట్లాది రూపాయల రెవెన్యూని షారూక్ వదులుకోవాల్సిన సన్నివేశమేనని విశ్లేషిస్తున్నారు.