'బాహుబలి' స్ఫూర్తితో బాలీవుడ్ లో తెరకెక్కతున్న భారీ మూవీ 'బ్రహ్మాస్త్ర'. మూడు భాగాలుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో మొదటి భాగం శివ సెన్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీని హీరో రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, యష్ హీరూ జోహార్ లతో కలిసి బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్ నిర్మిస్తున్నారు.
దక్షిణాది భాషల్లో ఈ మూవీకి ఎస్. ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ ని, మోషన్ పోస్టర్ తో వైజాగ్ లో రాజమౌళి, రణ్ బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇటీవల అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ తాజాగా కింగ్ నాగార్జున పాత్రని పరిచయం చేశారు. సినిమాలో నాగ్ పాత్ర పేరు ఆర్టిస్ట్ అనీష్ షెట్టి. 1000 నందుల పవర్ ఈ పాత్ర సొంతం. బ్రహ్మాస్త్రలో పవర్ ఫుల్ నందీ అస్త్రం ఈ క్యారెక్టర్.
పోస్టర్ లో నాగార్జున సీరియస్ లుక్ లో కనిపిస్తూ రైట్ హ్యాండ్ లో తన పవర్ కున్న శక్తిని ప్రదర్శిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. కుడిచేతికి వున్న కడియం నుంచి ఆకాశం వంక పవర్ జనరేట్ అవుతున్నట్టుగా చూపించారు. సినిమాలో నాగ్ క్యారెక్టర్ కున్న పవర్‌ని, ఆయన పాత్ర ప్రాముఖ్యతని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. పురాణాల్లో పరమశివుడి ప్రధాన వాహనం నందీశ్వరుడు. అలాంటి నంది. అలాంటి అత్యంత పవర్ ఫుల్ పాత్రలో నాగార్జున కనిపించనుండటం ఆకట్టుకుంటోంది.
ఇక సినిమాలో గురు పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ని శుక్రవారమే చిత్ర బృందం విడుదల చేసింది. ఇక రణ్ బీర్ కపూర్ లార్డ్ శివగా ఇందులో కనిపించబోతున్నాడు. అతని పాత్రని అత్యంత శక్తివంతంగా దర్శకుడు తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. అలియాభట్ ఇషా గా, రణ్ బీర్ కు ప్రియురాలిగా కనిపించబోతోంది. దమయంతి సింఘానియాగా మౌనిరాయ్, సైంటిస్ట్ గా అతిథి పాత్రలో షారుక్ ఖాన్ నటించారు.
భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 15న ఈ మూవీ ట్రైలర్ ని అన్ని భాషల్లోనూ ఒకే టైమ్ లో విడుదల చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ మూవీ పై బాలీవుడ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది.