విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ తన సినిమాలకు విభిన్న తరహాలో ప్రచారం చేపడతాడు. ప్రేక్షకులకు తన సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తాడు. అయితే తన సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాకు మాత్రం ప్రచారం విషయంలో వెనకబడి ఉన్నాడని చెప్పకతప్పదు.
సినిమా విడుదలకు వారం రోజులు మాత్రమే ఉన్నా ఇంకా ప్రమోషన్స్ ఊపందుకోలేదు. ఎంతసేపూ సోషల్ మీడియా ద్వారా చేసే రెగ్యులర్ ప్రచారమే కనిపిస్తోంది. పెద్ద హీరోలకు ఇలా ట్విట్టర్ ప్రచారం కొంతవరకూ ఉపయోగపడే అవకాశం ఉంది కానీ చిన్న సినిమాలకు ఈ స్ట్రేటజీ వర్క్ అవుట్ కాదు. ఇలాంటి సినిమాలకు టార్గెట్ ఆడియన్స్ తక్కువ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రచారం చేపడితేనే సినిమాపై బజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ సినిమా రిలీజ్ అయ్యేది అన్ సీజన్లో అనే విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు ప్రమోషన్ జోరుగా చేస్తే తప్ప ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండవు. ఈమధ్య రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాల విషయంలో అది ఋజువయింది. మరొక విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ బ్యానర్ పేరు 'కింగ్ ఆఫ్ ది హిల్' కూడా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాలేదు. బ్యానర్ ను ప్రమోట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.. లేకపోతే అది ఫ్యూచర్ లో బ్రాండ్ గా మరే అవకాశం ఉండదు. మరి విజయ్ దేవరకొండ అండ్ టీమ్ ఈ విషయంలో ఎలా ప్రొసీడ్ అవుతారో వేచి చూడాలి.