రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. కానీ వారి మూలాలు మిగిలే ఉన్నాయి. అందులో నేటిజనరేషన్ నుంచి కొందరు సినీవినీలాకాశంలో స్టార్లు గా వెలుగొందుతున్నారు. ప్రభాస్ రాజు- సైఫ్ అలీఖాన్- మనీషా కొయిలారా-అదితీరావ్ హైదరీ- ఇర్ఫాన్ ఖాన్- భాగ్యశ్రీ- కిరణ్ రావు (అమీర్ భార్య) వీరంతా రాజవంశీకులు. వారి ఘనచరిత పరిశీలిస్తే కళ్లు తేలేస్తారు. అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా? అంటారు.
భారతదేశంలో బ్రిటీష్ పాలనకు ముందు రాజుల పాలన కొనసాగేది. రిప్లిక్ ఇండియా అయ్యాక సంస్థానాలన్నీ అంతరించాయి. రాజ్యాలు లేకపోయినా కానీ రాజకుటుంబాలకు ఆ రాజసం అలానే ఉంది. పలువురు బాలీవుడ్ సహా సినీపరిశ్రమల్లో స్టార్లుగా వెలిగిపోతున్నారు.
ప్రస్తుతం ఆదిపురుష్ 3డిలో నటిస్తున్న ప్రభాస్ రాజుల కుటుంబీకుడు. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు వారసుడు. అంతకుముందు వారి పూర్వీకుల రాజరికపు కనెక్షన్స్ గురించి అభిమానులకు తెలిసినది కాస్త తక్కువే. ప్రభాస్ రాజు ఆతిథ్యం రుచి చూస్తే అది ఎవరూ ఎప్పటికీ మరవరని ఆయన అతిథి మర్యాదలను పొగడని వారు ఉండరు. ఇక ఇదే ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న సైఫ్ ఖాన్ రాజరికం నుంచి వచ్చిన వారు. పటౌడీ సంస్థానంలో నవాబ్ ల వారసుడగా సైఫ్ అలీఖాన్ సుపరిచితం. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా వెలిగిపోతున్నారు. ఇఫ్తిఖర్ - సైఫ్ అలీఖాన్ తండ్రి నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీ ఖాన్ భారత్- ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ లకు ఆడారు. వారి ప్యాలెస్ లు ఎంతో ఫేమస్. అమీర్ ఖాన్ భార్య.. సినీనిర్మాత దర్శకరచయిత అయిన కిరణ్ రావు... హైదరాబాద్ లోని నిజాం కుటుంబానికి చెందిన ప్రముఖురాలు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కిరణ్ రావు తాత వనపర్తి రాజాగారు. ఆ సంస్థానం జమీందార్ గా వెలిగారు. భూ స్వామిగా సుప్రసిద్ధులు.
కిరణ్ రావుకి అందాల కథానాయిక అదితీరావ్ హైదరీ దగ్గర బంధువు. హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రిగా కొనసాగిన సర్ ముహమ్మద్ అక్బర్ నజీర్ అలీ హైదరి కుటుంబానికి చెందిన వారు వీరంతా. బ్రిటీష్ వారు నియమించిన అస్పాం ప్రావిన్స్ చివరి గవర్నర్ ముహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీకి అదితీ మనవరాలు.
నేపాలీ రాజకుటుంబానికి చెందిన మనీషా కొయిరాలా దశాబ్ధం పైగానే బాలీవుడ్ సహా సినీపరిశ్రమల్లో స్టార్ గా వెలిగారు. కొయిరాలా కుటుంబం నేపాల్ లో రాజకీయ కుటుంబం. తాత బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా 1950 - 1960 లలో నేపాల్ ప్రధాని. మనీషా తండ్రి నేపాల్ మంత్రివర్గంలో పర్యావరణ- విజ్ఞాన -సాంకేతిక మంత్రిగా పనిచేశారు. కుటుంబీకులంతా నాయకులే. రాజస్థాన్ లోని పఠాన్ కుటుంబీకుడు ఇర్ఫాన్ ఖాన్. తల్లిదండ్రులకు గొప్ప రాజరిక నేపథ్యం ఉంది. ఇర్ఫాన్ తండ్రి గ్రామానికి జమీందార్. రియా సేన్ - రీమా సేన్ రాజవంశీకులు. వారి నానమ్మ ఇలా దేవి బరోడా రాజు సయాజిరావ్ గైక్వాడ్ 3 కుమార్తె. ఇలా దేవి తల్లి ఇందిరా రాజే కూచ్ బెహర్ యువరాణి. కుటుంబీకులు చాలామంది రాజరికంలో ఉన్నారు. మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన రాయల్ పట్వర్ధన్ కుటుంబానికి చెందిన నటి. మహారాజా విజయ్ సింగ్ రాజే పట్వర్ధన్ ఆమె తండ్రి. ఇలా ఇండస్ట్రీలో పలువురు రాజుల కుటుంబీకులు స్టార్లు గా వెలుగొందుతున్నారు.