అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో చిన్న సినిమాలు వరుసగా వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈమద్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అల్లు అరవింద్ వెనుక ఉండి బన్నీ వాసుతో వరుసగా చిన్న సినిమాలను నిర్మింపజేస్తున్నాడు. సమర్పకుడిగా పేరు మాత్రమే కాకుండా అల్లు అరవింద్ అన్ని విధాలుగా సినిమాకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారట.
చిన్న హీరోలతో.. కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 వారు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా కూడా కిరణ్ నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. చిన్న సినిమాలతో కంటిన్యూస్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కిరణ్ కు ఈ సినిమా ఖచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
వినరో భాగ్యము విష్ణుకథ అనే టైటిల్ తో మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా కశ్మీర పరదేశీ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ముగించారు. చిత్ర యూనిట్ సభ్యులు తిరుపతిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసినట్లుగా ప్రకటించారు. సినిమా కు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదటి షెడ్యూల్ లో కిరణ్ అబ్బవరం మరియు ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలతో పాటు ఒక యాక్షన్ సన్నివేశం మరియు పాటను కూడా చిత్రీకరించారు అనే సమాచారం అందుతోంది. విభిన్నమైన పాత్రలో కిరణ్ అబ్బవరంను ఈ సినిమా లో దర్శకుడు మురళి చూపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్ర దర్శకుడు కిరణ్ అబ్బవరం గతంలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద మరియు ప్రముఖ తెలుగు దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.
ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఈ దర్శకుడు ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యాడు. అల్లు అరవింద్ ను మెప్పించాడు అంటే ఇప్పటికే అతడు సగం సక్సెస్ అయ్యాడు. కనుక మరో సగం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అవుతాడు.