నిఖిల్ తో పెళ్లి వద్దన్న ఇద్దరు హీరొయిన్లు

Update: 2018-03-11 05:24 GMT
సినిమా ప్రమోషన్లు క్రేజీగా మారుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ వైపు తిప్పుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. దీనికి తగ్గట్టు కొత్త తరం హీరొయిన్లు తమ మాటల ద్వారా చేతల ద్వారా తాము ఎంత డిఫరెంటో ఋజువు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వచ్చే శుక్రవారం విడుదల కానున్న కిరాక్ పార్టీ మీద యూత్ చాలా హోప్స్ తో ఉంది. తమను మెప్పించే హోల్ సం ఎంటర్ టైనర్ ఇదే అని బలంగా నమ్ముతున్నారు. తొలిప్రేమ మెప్పించింది కాని అందులో ప్రేమనే థీమ్ గా తీసుకున్నారు. కాని కిరాక్ పార్టీలో కాలేజీ మసాలాలు అన్ని ఉన్నాయి. అందుకే ఈ మూవీ గన్ షాట్ హిట్ అని బలంగా నమ్ముతోంది యూనిట్. కన్నడలో ఏడాది ఆడిన మూవీ రీమేక్ కనక ఆ కాన్ఫిడెన్స్ న్యాయమే. దీని ప్రమోషన్ లో భాగంగా 'సూప్ గేమ్' అనే వెరైటీ షో హీరో నిఖిల్ హీరొయిన్లి సిమ్రన్ పరింజ్దా, సంయుక్తా హెగ్డేల మధ్య నిర్వహించారు.

దీని ప్రకారం ఈ ముగ్గురిని ఒకే ప్రశ్న అడుగుతారు. తప్పు సమాధానం చెబితే రసగుల్లా, కాఫీ కలిపిన విచిత్రమైన సూప్ తాగాల్సి ఉంటుంది. హీరొయిన్లు ఇద్దరినీ అడిగిన ప్రశ్న నిఖిల్, దర్శకుడు శరన్ కొప్పిశెట్టి, నిర్మాత అనిల్ సుంకరలలో ఒకరిని చంపి, ఒకరిని పెళ్లి చేసుకుని, మరొకరితో హుక్ అప్ చేసుకోవాల్సి వస్తే ఎం చేస్తారు అని. దీనికి ముందుగా సిమ్రన్ చెప్పిన సమాధానం ముందుగా పెళ్ళైన అనిల్ సుంకరను చంపేసి నిఖిల్ తో హుక్ అప్ చేసుకుని లాస్ట్ లో శరన్ కొప్పిశెట్టితో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందట. హుక్ అప్ అంటే ఒక్క రాత్రి గడపటం అని యాంకర్ చెబితే నిఖిల్ ఒక్క రాత్రి మెటీరియల్ అని చెప్పి సిమ్రన్ పెద్ద షాకే ఇచ్చింది.

సంయుక్త మాత్రం రివర్స్ ఆన్సర్ ఇచ్చింది. నిఖిల్ ని చంపేసి అవకాశాల కోసం శరన్ కొట్టి శెట్టి తో హుక్ అప్ చేసుకుని ధనవంతుడు - నిర్మాత కాబట్టి అనిల్ సుంకరను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. దీంతో యాంకర్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంత గడుసుగా క్రిమినల్ మైండ్ తో చెప్పిన సమాధానాలు విని. రెండు కేసుల్లో నిఖిల్ తో ఫైనల్ గా సెటిల్ అవుతాము అని ఇద్దరూ చెప్పకపోవడం చూస్తే నిఖిల్ ని భలేగా టీజ్ చేసారు అనిపిస్తుంది కదూ.
Tags:    

Similar News