ఇంటికి 'కుక్కలున్నాయ్ జాగ్రత్త' అనే బోర్డు ఉంటే చాలు.. అక్కడికి కిట్టు వచ్చేస్తాడట. అడిగినంత క్యాష్ వందల్లో ఇస్తే ఓకె.. లేదని పాత 1000 లేదా 500 నోట్లలో ఇస్తే మాత్రం.. కుక్క రాదు.. దాని బొక్కే వస్తుంది.. అంటున్నాడు ఈ కిట్టూ భాయ్. అదే ఈ కిడ్నాపర్ స్పెషాలిటీ.
అసలు ''కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'' అనే సినిమా కాన్సెప్ట్ ఏంటో ఎక్సప్లెయిన్ చేయడానికి.. ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ ఒక కాన్సెప్ట్ టీజర్ తో విచ్చేశాడు. ఈ టీజర్ లో అసలు సినిమాలో దర్శకుడు వంశీ కృష్ణ తనని ఎలా చూపించబోతున్నాడు చెప్పేశాడు. మొత్తానికి సినిమా గురించి టోటల్ కాన్సెప్టును రాజమౌళి తరహాలో ముందే చెప్పేయడం కాస్త పెద్ద విషయమే. ఎందుకంటే ఇలా కాన్సెప్ట్ అంతా చెప్పేశాక వెండితెరపై స్ర్కీన్ ప్లే తో ఆకట్టుకోవాలి.
ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే మాత్రం.. మరోసారి రాజ్ తరుణ్ ఒక హిట్టు కంటెంట్ తోనే వస్తున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఇలా కుక్కలను ఎత్తుకెళ్ళిపోవడం తరహా పనులన్నీ పిల్లలకీ ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా క్యూట్ గా అనిపిస్తాయ్. వాళ్లకు నచ్చితే ఇక సినిమా హిట్టేగా