కల్యాణ్ రామ్ హీరోగా .. నిర్మాతగా 'బింబిసార' సినిమా రూపొందింది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'అప్ క్లోజ్ విత్ ఎన్కే ఆర్' టైటిల్ తో ఈ సినిమాకి ముందునుంచి ఏం జరిగిందనేది ఎపిసోడ్స్ గా చెబుతూ వస్తున్నాడు. అలా తాజాగా ఆయన నుంచి మూడో ఎపిసోడ్ వచ్చింది. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "చాలాకాలంగా ఎలాంటి కథ చేస్తే బాగుంటుందా అని నేను అనుకుంటూ వస్తున్నానో అలాంటి కథనే వశిష్ఠ వినిపించాడు. దాంతో నువ్వు చెబుతున్నదంతా నిజమేనా? అంటూ అడిగేశాను.
కథ మొత్తం వినేసిన తరువాత ఇలాంటి కథ కదా మనం చేయవలసింది అనిపించింది. అలా 'బింబిసార' చేయడానికి అక్కడ పునాది పడింది. పాస్ట్ లో ఉండే ఒక కింగ్ ప్రెజెంట్ లోకి వస్తే ఎలా ఉంటాడు? అనేది ఈ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్. విపరీతమైన ఈగో కలిగిన అలాంటి ఒక పాత్రను నేను ఇంతవరకూ చేయలేదు.
అతను టైమ్ ట్రావెల్ చేసి ప్రెజెంట్ కి వస్తాడు .. జీవితంలో ఎలా ఉండాలనేది తెలుసుకుంటాడు. ఈ సినిమాలో నా పాత్రకి తగినట్టుగా ఫిట్ నెస్ తో కనిపించవలసి వచ్చింది. 'ఎంతమంచివాడవురా' సినిమా సమయానికి నేను బాగా బరువు పెరిగాను. ఈ సినిమా కోసం 88 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గాను.
సాధారణంగా రాజులు పులులు .. సింహాలు పెంచుకోవడం ఇంతవరకూ చూపిస్తూ వచ్చారు. అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఉండాలనే ఉద్దేశంతో, బింబిసారుడు మొసలిని పెంచుతున్నట్టుగా చూపించాము. అది ఆయన సింహాసనానికి ముందు కొలనులో ఉన్నట్టుగా చూపించాము. నా కెరియర్ లోనే ఇది చాలా బిగ్గెస్ట్ ఫిల్మ్. 135 వర్కింగ్ డేస్ లో దీనిని పూర్తిచేశాము. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీరవాణిగారితో చేయించాలనుకున్నాము. అందుకోసం ఆయన దగ్గరికి వెళ్లాము. సినిమా చూసిన తరువాత ఆయన ఏమంటారా అని చాలా టెన్షన్ పడ్డాము.
'బాహుబలి' .. 'మగధీర' .. 'ఆర్ ఆర్ ఆర్' వంటి భారీ సినిమాలకి చేసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మేము డిఫరెంట్ జోనర్లో మా సినిమా చేస్తూ వెళ్లాము. అలాంటి ఒక సినిమా చూసి ఆయన ఏమంటారా అని కంగారుపడుతూనే ఉన్నాము.
అసలు ఈ సినిమాకి పని చేయడానికి ఆయన ఓకే అంటారా? అనే టెన్షన్ వచ్చేసింది. ఆయన ఈ సినిమా చూడగానే ఓకే చెప్పడంతోనే సగం సక్సెస్ వచ్చేసినట్టుగా హ్యాపీగా ఫీలయ్యాము. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది. ఇందాక నేను తారక్ తో ఫోన్లో ఏం మాట్లాడాను? తాను ఏం చెప్పాడు? అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.