సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా లో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సాయీ మంజ్రేకర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడు అయిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. ప్రభుదేవా దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' సినిమా తో హీరోయిన్ గా పరిచయమైంది సాయీ మంజ్రేకర్. ఇక మహేష్ సినిమా లో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్ట బోతోంది అనుకున్నారు. అయితే ఈ సినిమా లో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేయడం తో ఈ వార్తలన్నీ రూమర్స్ అని తెలిసి పోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం సాయీ మంజ్రేకర్ త్వరలోనే టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోందట.
మహేష్ బాబు సతీమణి నమ్రత ఇప్పటికే సాయి మంజ్రేకర్ ని టాలీవుడ్ లో లాంచ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఏ సినిమాతో అమ్మడిని ఇంట్రడ్యూస్ అవబోతుంది అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ కచ్చితం గా నమ్రత ద్వారానే 'దబాంగ్' బ్యూటీ ఆరంగేట్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నమ్రత శిరోద్కర్ అండ్ టీమ్ కలిసి ఓ కాస్టింగ్ అండ్ ప్రొమోషన్స్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. వీరికి ఆల్రెడీ క్లైంట్స్ ఉన్నారట. సాయీ మంజ్రేకర్ కూడా ఆ బ్యాచ్ లో ఉన్న హీరోయిన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఏఎంబీ థియేటర్స్ మరియు హుంబుల్ టెక్స్ టైల్ బిజినెస్ లలో మహేష్ కి చేదోడువాదోడుగా ఉంటున్న నమ్రత ఇక జీఎంబీ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి సినిమా నిర్మాణాల లోను కీలకం గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రొమోషన్స్ ఏజెన్సీ కూడా ప్రారంభించే ఆలోచన చేస్తోందట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.