ఇదే షాట్‌ వేరే హీరో సినిమాలో ఉంటే రచ్చే..!

Update: 2018-09-22 08:13 GMT
సంపూర్నేష్‌ బాబు ‘హృదయకాలేయం’ చిత్రం విడుదలైన కొన్నాళ్లకే ప్రకటించబడ్డ చిత్రం ‘కొబ్బరిమట్ట’. దాదాపు మూడు సంవత్సరాల పాటు సెట్స్‌ పై ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఈ చిత్రంను నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా సినిమాలోని వీడియో సాంగ్‌ ప్రోమోను విడుదల చేయడం జరిగింది. బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌ పార్టిసిపెంట్స్‌ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాట టీజర్‌ లోని ఒక షాట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఎపిక్‌ బోల్డ్‌ సీన్‌ ఆఫ్‌ తెలుగు సినిమా అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ పిక్‌ ను అందరు లైట్‌ తీసుకుంటూ - సంపూ కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నారు. కాని ఇదే షాట్‌ ఏ హీరో సినిమాలో అయినా - మరే కమెడియన్‌ చేసినా కూడా వివాదం అయ్యేది. మనోభావాలు దెబ్బ తీసేలా సదరు సీన్‌ ఉంది అంటూ విమర్శలు చేసేవారు. కాని సంపూ సినిమా అవ్వడం వల్ల అంత కూడా చాలా కామెడీగానే తీసుకుంటున్నట్లుగా సోషల్‌ మీడియాలో టాక్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

‘హృదయకాలేయం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సంపూర్నేష్‌ బాబు ఈ చిత్రంతో మరోసారి ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం ఖాయం అంటూ ఇప్పటికే అంతా నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ పాటతో అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా ఆరంభం నుండి చివరి వరకు సంపూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటూ నమ్మకంగా ఉన్నారు. కొబ్బరి మట్ట చిత్రంలో సంపూ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News