ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కనీసం రెండు పదుల వయసు కూడా నిండా లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతుంది. హీరోయిన్ గా తెలుగు లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉన్నా కూడా ఇంకా కొత్త సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది.
తెలుగు లో ఇప్పటికే ఉప్పెన.. బంగార్రాజు మరియు శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాలను దక్కించుకుంది. మరో వైపు రామ్ తో కలిసి ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. సుధీర్ బాబుతో ఒక సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. ఇంకా రెండు మూడు తెలుగు సినిమాలకు ఈమె కమిట్ అయ్యి చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు మరో వైపు కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యింది. ఇప్పటికే అక్కడ తమిళ స్టార్ హీరో సూర్య తో కలిసి బాలా దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తుంది. అంతకు ముందే ఒక చిన్న హీరో సినిమాకు కమిట్ అయ్యింది. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుని తమిళ నాట స్టార్ హీరోలకు పోటీ అన్నట్లుగా నిలిచిందంటూ చర్చ జరుగుతోంది.
ఈసారి అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరున్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని నటింపజేస్తున్నారట.
సూర్య మరియు ధనుష్ లతో ఒకే సారి అవకాశం దక్కించుకుంది అంటే తమిళ నాట ఇక ఈ అమ్మడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని.. తెలుగు లో కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు నాలుగు సినిమాల ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు సక్సెస్ లు దక్కుతున్న నేపథ్యంలో మరెంతగా దూకుడు గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఏకకాలంలో బిజీగా ఉండే హీరోయన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కృతి శెట్టి ఒకరు. అక్కడ ఇక్కడ ఫుల్ బిజీగా ఉండి అత్యధిక పారితోషికం దక్కించుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో నిలిచింది. బేబమ్మ ముందు ముందు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంటుందేమో చూడాలి.