లావణ్య త్రిపాఠికి రూ.3 కోట్ల జరిమానా?

Update: 2017-10-30 08:21 GMT
అసలే లావణ్య త్రిపాఠి కెరీర్ అంతంతమాత్రంగా ఉంది. ఈ ఏడాది ‘రాధ’.. ‘మిస్టర్’.. ‘యుద్ధం శరణం’ లాంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి ఆమెకు. లావణ్య లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఫలితం బాగానే ఉండేలా అనిపిస్తున్నా ఈ సినిమాలో ఆమె పాత్రకు ఏమంత మంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో లావణ్యకు మున్ముందు అవకాశాలు కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం. తమిళ నిర్మాతల మండలి లావణ్యకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

తమిళంలో ఆల్రెడీ సందీప్ కిషన్ సరసన ‘మాయవన్’ అనే సినిమా చేసిన లావణ్య.. దీని తర్వాత ‘100 పర్సంట్ లవ్’ రీమేక్‌ కు కూడా ఓకే చెప్పింది. కానీ ఈ సినిమా నుంచి అనివార్య కారణాల వల్ల లావణ్య తప్పుకుంది. ఐతే ముందు కమిట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత లావణ్య షూటింగుకి హాజరు కాలేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ చిత్ర తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ఈ కేసును పరిశీలించిన నిర్మాతల మండలి లావణ్యదే తప్పు అని తేల్చి.. ఆమెకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు కోలీవుడ్ మీడియా పేర్కొంది. ఐతే ఈ విషయమై లావణ్య నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వార్త నిజమే అయితే మాత్రం లావణ్యకు అది రెండు విధాలుగా ఎదురుదెబ్బే. రూ.3 కోట్ల జరిమానా కట్టడం పెద్ద విషయమే. పైగా దీని వల్ల వచ్చే చెడ్డ పేరుతో ఆమెకు తమిళంలో ఇంకో ఛాన్స్ దక్కడం కష్టమవుతుంది. అసలే కెరీర్ అంతంతమాత్రంగా సాగుతున్న సమయంలో లావణ్యకు ఇలాంటి అనుభవం ఏంటో?
Tags:    

Similar News