నాని.. శివ నిర్వానల కాంబోలో వచ్చిన నిన్ను కోరి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో వస్తున్న టక్ జగదీష్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా టక్ జగదీష్ ఉంటుందనే నమ్మకంను మొదటి నుండి యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే నిన్నుకోరి మరియు టక్ జగదీష్ సినిమాలకు పూర్తి వ్యతాసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిన్ను కోరి సినిమాతో పోల్చితే జగదీష్ సినిమాలో స్టార్ కాస్టింగ్ భారీగా కనిపిస్తుంది. అదే సమయంలో ఒక పక్కా ఫ్యామిలీ సినిమా గా కలర్ ఫుల్ గా కంటికి ఇంపుగా కన్నుల పండుగగా జగదీష్ ఉండబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు వీడియోలను బట్టి అనిపిస్తుంది.
ఇటీవల విడుదల అయిన కోలో కోలన్న కోలో... మేకింగ్ వీడియో సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. కృష్ణవంశీ సినిమా రేంజ్ లో ఒక పెద్ద కుటుంబంను ఇందులో చూపించబోతున్నట్లుగా వీడియోను చూస్తుంటే అనిపిస్తుంది. నాని ఈ సినిమా లో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లతో రొమాన్స్ చేయబోతున్న విషయం తెల్సిందే. వీరిలో లీడ్ ఎవరు అనేది సినిమా విడుదల అయితే కాని తెలియదు. నాని హీరోగా గత ఏడాది 'వి' సినిమా వచ్చింది. అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అందుకే అభిమానులు టక్ జగదీష్ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నాని ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేయడం ఖాయం గా అనిపిస్తుంది.
Full View