బ్రూస్ లీ సినిమా రిలీజైంది. ఈ సినిమా ఎన్నో సందేహాల్ని లేవనెత్తింది. టాలీవుడ్ లో ఎప్పటికీ రొటీన్ కథల్ని తిప్పి తిప్పి చూపిస్తే ప్రేక్షకుడు భరించాల్సిందేనా? అన్నది మొదటి సందేహం. ఇక పోతే శ్రీనువైట్ల అంటే బ్రహ్మానందం ఉండాల్సిందే. అతడు లేనిదే కామెడీ లేనేలేదు అనుకునే పరిస్థితి. రొటీనిటీ నుంచి బైటపడేస్తాం అంటూనే రొటీన్ కథని తిప్పి తీసిన శ్రీనువైట్ల గురించి ఏమనుకోవాలి? అన్న విమర్శ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో ఓ ఊహించని సన్నివేశం జనాల్ని అవాక్కయ్యేలా చేసింది.
స్టార్ కమెడియన్ బ్రహ్మానందంని శ్రీను కోతిని చేసి ఆడించాడు. బ్రహ్మీ మంకీ టైపులో బోలెడన్ని ఎక్స్ ప్రెషన్స్ పలికిస్తాడు. సంతోషంగా లేని మంకీ - జ్వరంతో బాధపడే మంకీ - తిండి లేని మంకీ - ఎగ్జయిట్ అయిపోయే మంకీ .. ఇన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు బ్రహ్మానందం. అయితే అది అసందర్భమైన సన్నివేశం అని జనాల నుంచి విమర్శలొచ్చాయి. అయినా అంతటి సీనియర్ నటుడి చేత అసందర్భంగా అలాంటి మంకీ వేషాలు వేయించడమేంటి? అంటూ క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు.
ఈ పాపం శ్రీనూ- కోన జోడీదే. ఈ ఇద్దరూ కలిసే ఇలాంటి పని చేశారు. ఢీ - రెడీ - దూకుడు - బాద్ షా లాంటి సినిమాల్లో చక్కని క్యారెక్టర్ లలో నటించిన బ్రహ్మానందం బ్రూస్ లీ చిత్రంలో ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ లో చేయడం బాలేదన్న విమర్శకు అట్నుంచి ఎలాంటి రిప్లయ్ వస్తుందో?