ఎందుకిలా?: కోన సక్సెస్‌, వక్కంతం ఫ్లాప్‌

Update: 2015-08-23 22:37 GMT
రైటర్ల క్రెడిట్‌ డైరెక్టర్లే కొట్టేస్తున్నారు. టైటిల్స్‌ లో పేరు వేయకుండా మభ్య పెడుతున్నారు. అటు పారితోషికంలోనూ కొట్టేస్తున్నారంతా. ఇది ఎప్పట్నుంచో టాలీవుడ్‌ డైరెక్టర్ల పై ఉన్న కంప్లయింట్‌. స్టార్‌ రైటర్స్‌ కోన వెంకట్‌, గోపిమోహన్‌ అంతటివారే ఈ విషయంలో శ్రీనువైట్ల తో గొడవ పెట్టుకున్నారు. భారీగా పారితోషికం లేదు. కనీసం తెరపై టైటిల్స్‌ లో పేరైనా వేయలేదు అంటూ 'ఆగడు' ముందు శ్రీనువైట్ల తో గొడవ పెట్టుకున్నారు. అది పెద్ద రచ్చయ్యింది.

చివరికి ఈ ముగ్గురినీ కలిపి నచ్చచెప్పి చరణ్‌ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. శ్రీనుని, కోనని కలిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కోన మళ్లీ శ్రీనువైట్ల తో కలిసి పనిచేయటానికి ఒప్పుకోవడానికి కారణం టైటిల్స్‌ లో క్రెడిట్‌ ఇవ్వడమే. ఈసారి డైలాగ్స్‌, స్టోరీ లో కోన పేరు వేయడానికి శ్రీను అంగీకరించాడు. ఇప్పుడు సేమ్‌ సీన్‌ వక్కంతం వంశీ విషయంలనూ రిపీటైంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్‌2'కి వక్కంతం కథ, డైలాగులు అందించాడు. టైటిల్స్‌ లో తన పేరు కోసం పాకులాడి మరీ వేయించుకున్నాడు వంశీ. అయితే ఈ రెండు సందర్భాల్లో ఓ చిన్న ట్విస్ట్‌. ఈ గేమ్‌ లో కోన గెలిచాడు. వంశీ ఓడిపోయాడు.

కోన శ్రీను నుంచి విడిపోయాక 'లౌక్యం', 'గీతాంజలి' సినిమాలకు రచయితగా పనిచేసి హిట్లు అందుకున్నాడు. కానీ వక్కంతం 'కిక్‌2'తో ఖంగుతినేశాడు. ఈ సినిమా కథ, కథనం, డైలాగులు ఏదీ బాలేదని విమర్శలొచ్చాయి. హక్కుల్ని పోరాడి సంపాదించుకున్నా.. కోన హిట్‌, వంశీ ఫ్లాప్‌ అనేగా అర్థం.
Tags:    

Similar News