శ్రీ రెడ్డి కి కోన ఓపెన్ ఛాలెంజ్

Update: 2018-04-13 13:57 GMT
నిన్నటి వరకు శ్రీ రెడ్డి వివాదం ఎంతగా వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే దాదాపు ఆమెకు ఓ సొల్యూషన్ దొరికింది అని అనుకుంటున్న సమయంలో ప్రస్తుతం మీడియా నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ తో వివాదాన్ని ఇంకా పొడిగించే ప్రయత్నం చేస్తోంది. ఆ మ్యాటర్ పక్కనపెడితే శ్రీ రెడ్డి స్క్రీన్ షాట్స్  ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పోరాటం చేస్తున్నారు గాని తప్పు ఎవరు చేశారు అనే దానిపై ఇంత వరకు క్లారికి లేదు.

బయట మంచి పేరున్న వ్యక్తులపై ఆమె కామెంట్స్ చేయడం అలాగే తనతో చాటింగ్ చేశారంటూ  స్క్రీన్ షాట్ బయటపెట్టడం జరిగింది. అందులో కోన వెంకట్ పేరున్న సంగతి తెలిసిందే. గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడంటూ శ్రీ రెడ్డి ఆరోపణలు చేశారు. అయితే కోన వెంకట్ ఈ విషయంపై సోషల్ మీడియాలో అప్పుడే స్పందించారు. కానీ ఇప్పుడు గొడవ ఎండ్ అయ్యింది అనుకుంటున్న సమయంలో కోన స్పందించారని సమాచారం.

ఓపెన్ ఛాలెంజ్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాను తప్పు చేశానని రుజువైతే ఎలాంటి శిక్షకైనా రెడీ అంటున్నారట. అంతే కాకుండా లై డిటెక్టర్ ద్వారా చెక్ చేసుకోవచ్చని తాను ఎప్పుడు శ్రీ రెడ్డి అనే అమ్మాయిని కలవలేదని చెబుతున్నారని టాక్ వస్తోంది. అయితే మీడియాల్లో చర్చలు పెడితే పరిస్థితులు తారు మారవుతాయని.. ఒకటి చెబితే మీడియా మరొకటి చూపిస్తుందని చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ముందుకెళ్లాలని సన్నహితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.      
Tags:    

Similar News