బి, సి ఆడియెన్‌ కి స‌ప‌రేట్ ఇండ‌స్ర్టీ?

Update: 2015-11-29 06:24 GMT
ప‌రిశ్ర‌మ‌ని దిశానిర్ధేశ‌నం చేస్తున్న స్టార్ రైట‌ర్ల‌లో ఒక‌నిగా కోన వెంక‌ట్ అసాధార‌ణ సేవ‌లు చేస్తున్నారు. ఆయ‌న్ని రైట‌ర్ల‌లో డాన్ అంటే త‌ప్పేం కాదు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని, హీరోల్ని త‌న‌వైపు తిప్పేసుకునే స‌మ‌ర్థ‌త ఉన్న రైట‌ర్‌ గా కోన‌ను చెప్పుకోవ‌చ్చు. అంత‌టి కోన వెంక‌ట్ నిన్న‌టిరోజున ఓ మాట అన్నారు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉంది. ఒక‌ప్పుడు బాలీవుడ్ ఇలాంటి స‌న్నివేశంలో ఉండేది. అస‌లు లోక‌ల్ ఆడియెన్ సినిమాలు చూడ‌క‌పోయే ప‌రిస్థితిలో.. ఇలా అయితే లాభం లేద‌నుకుని ఓవ‌ర్సీస్ మార్కెట్‌ పై ప‌డ్డారు. మల్టీప్లెక్స్ ఆడియెన్‌ ని టార్గెట్ చేసి సినిమాలు తీశారు. ఇప్ప‌టికీ అలాంటి ప్ర‌యోగాలెన్నో చేస్తూనే ఉన్నారు.  సేమ్ టు సేమ్ మ‌న టాలీవుడ్ కూడా అదే చేస్తోందిప్పుడు. కేవ‌లం లోక‌ల్ ఆడియెన్‌ నే న‌మ్ముకుంటే అయిపోయిన‌ట్టే. అందుకే ఓవ‌ర్సీస్‌ ని టార్గెట్ చేయాల్సొస్తోంది.. అంటున్నారాయన.

ఇకపోతే.. అస‌లు టాలీవుడ్‌ లో బి,సి కేంద్రాల ఆడియెన్‌ ని న‌మ్ముకుని సినిమాలు తీయాలా?  లేక స్ట‌యిల్ మార్చి కొత్త సినిమాని ట‌చ్ చేయాలా?  తెలియ‌ని అయోమ‌యం నెల‌కొందిప్పుడు అంటున్నారు కోన. మునుముందు టాలీవుడ్ సినిమా రెండు ముక్క‌ల‌య్యేట్టే ఉంది. అందులో ఒక‌టి మ‌ల్టీప్లెక్స్ సినిమా,  మ‌రొక‌టి బి,సి కేంద్రాల ఆడియెన్ కోస‌మే తీసే ఇండ‌స్ర్టీగా ముక్క‌ల‌య్యేట్టుంది. ఇటీవ‌లి కాలంలో పాత బ‌స్తీ కోసం తీస్తున్న ద‌క్క‌న్ సినిమా లాగా బి, సి ఆడియెన్ కోసం ఓ స‌ప‌రేట్ ఇండ‌స్ర్టీ పెట్టుకోవాల్సిందేన‌ని కాసింత సీరియ‌స్‌ గా నే వ్యాఖ్యానించారాయ‌న‌. ఏం చేసినా మీ చేతిలోనే ఉంది గురూ!
Tags:    

Similar News