ఒకే రోజు.. కోన వెర్సస్ కోన

Update: 2017-06-24 09:55 GMT
రచయితగా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగాడు కోన వెంకట్. దాదాపు దశాబ్దం పాటు అతడి హవా సాగింది. గత రెండు మూడు దశాబ్దాల్లో త్రివిక్రమ్ తర్వాత రచయితగా అంతటి స్టార్ స్టేటస్ సంపాదించింది కోన వెంకటే. ఐతే కోటి రూపాయల దాకా పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగిన కోన.. గత రెండు మూడేళ్లలో బాగా డౌన్ అయిపోయాడు. ఆయన పని చేసిన సినిమాలన్నీ తేడా కొట్టేయడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు. మధ్యలో ప్రొడక్షన్లోనూ అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నాడు కోన. ఇప్పుడాయన ఆశలు ‘నిన్నుకోరి’ మీదే ఉన్నాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నాడు కోన.

కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ ఫ్రెష్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. దీని ట్రైలర్ అదీ చూస్తే.. కోన గత సినిమాలతో అసలేమాత్రం పోలిక కనిపించట్లేదు. ఈ తరహా ఇంటెన్స్ లవ్ స్టోరీలకు కోన పని చేయడం అరుదు. మరి ఇందులో కోన పెన్ ఎలా మెరిసిందో చూడాలి. విశేషం ఏంటంటే.. ‘నిన్ను కోరి’ విడుదలయ్యే జులై 7నే ఆయన రచయితగా పని చేసిన మరో సినిమా కూడా విడుదలవుతోంది. అదే.. మామ్. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ హిందీ సినిమాకు మూల కథ అందించింది కోన వెంకటే కావడం విశేషం. ఇది కూడా కోన గత సినిమాలకు పూర్తిగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ జులై 7నే విడుదల చేయబోతున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో కోనకు ఏది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News