గతేడాది కోన వెంకట్ కు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే... ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘బ్రూస్ లీ’ సినిమా ఫ్లాప్ కావడం... అంతకు ముందు అతను రైటర్ గా పనిచేసిన త్రిపుర సినిమా ఫ్లాప్ అయింది. దాని తరువాత వచ్చిన ‘శంకారాభరణం’ లాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. అంతేనా... అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్’ కూడా పరాజయం పాలు కావడంతో కోనకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇండస్ట్రీలో కోన వెంకట్ శకం ముగిసింది అనుకున్నారంతా. అయితే బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో కోన వెంకట్ కు కొంత ఊరట లభించింది. లౌక్యం సినిమా తరువాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి కోన వెంకట్ ఈ సినిమాకు రైటర్ గా పనిచేశారు. మరి డిక్టేటర్ ఇచ్చిన బూస్టప్ పనిచేసిందో ఏమో.. ఇప్పుడు మళ్లీ తన కలానికి పదును పెట్టాలని చూస్తున్నాడు కోన.
తాజాగా ప్రభుదేవా - తమన్నా జంటగా నటించే ఓ హారర్ కామెడీ సినిమా తెలుగు హక్కులను కోన చేజిక్కించుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా తెలుగు వర్షెన్ కు సంభాషణలు కూడా కోన వెంకట్ రాస్తున్నాడు. ఎంతో మంది నిర్మాతలు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడినా... చివరకు కోన కే దక్కాయి. ఎ.ఎల్.విజయ్(నాన్న ఫేం - అమలాపాల్ భర్త) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలే వున్నాయి. ఎందుకంటే... ప్రముఖ కొరియోగ్రాఫర్-హీరో-దర్శకుడైన ప్రభుదేవా తొలిసారిగా తమన్నాతో కలిసి నటిస్తున్నాడు. ఇటీవల దర్శకుడిగా మారిన తరువాత ప్రభుదేవా నటనపై ఎక్కువగా దృష్టిపెట్టేలేదనే చెప్పాలి. ఎబీసీడీ తరువాత చేస్తున్న సినిమా ఇదే. దానికి తోడు ప్రభుదేవాతో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా జతకట్టడంతో యూత్ లో మంచి క్రేజ్ నెలకొంది. అలాంటి సినిమాకు సంభాషణలు తెలుగులో అందించడం కోనకు దక్కిన గోల్డెన్ ఛాన్సే అని చెప్పొచ్చు. తాను ఈ సినిమా హక్కులు పొందిన విషయాన్ని కోన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు... జర్నీ కంటిన్యూస్ అని రాశాడు. అంటే.. ఇక నుంచి మునుపటి లాగే తాను తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ అయిపోతానే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఈ సినిమా తెలుగు హక్కులతోపాటు... సంభాషణలు అందించనుండటంతో.. అరే కోన భలే పట్టేశాడే అంటున్నారు టాలీవుడ్ క్రిటిక్స్. అంతే కాదు తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’ మూవీ కన్నడ రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు విక్రయించినట్టు తెలిపారు. కన్నడలో ఓ స్టార్ హీరో కుమారుడు ఇందులో నటించబోతున్నాడని కూడా ట్విట్టర్లో పేర్కొన్నాడు. కోనకు కన్నడ మీద పట్టుంటే.. ఈ సినిమాకు సంభాషణలతో పాటు... స్క్రీన్ ప్లే కూడా అందించేలా వున్నాడంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. చూడాలి మరి... కోన కొత్త ఏడాదిలో ఫన్ తో ఏమాత్రం చెలరేగిపోతాడో?