మెగా డాటర్‌.. ఆవేశం ఎందుకో!!

Update: 2015-10-30 13:15 GMT
ఓ ఛానల్‌ లో ప్రసారమయ్యే చిన్న పిల్లల డాన్స్ కార్యక్రమానికి  యాంకర్ .. కట్‌ చేస్తే.. ఓ షార్టు ఫిలింలో హీరోయిన్‌.. మళ్ళీ కట్‌ చెబితే.. వెండితెర డెబ్యూకు అంతా రెడీ.. రామరాజు డైరక్షన్‌ లో ''ఒక మనసు'' వచ్చేస్తోంది.. ఇది పూర్తవ్వకుండానే కట్‌ చేస్తే.. ఇప్పుడు 'ముద్దపప్పు ఆవకాయ' అంటూ వెబ్‌ సిరీస్‌.. అసలేం జరుగుతోందండీ ఈ మెగా డాటర్‌ కొణిదెల నిహారిక విషయంలో??

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేసింది. వచ్చే పండుగల్లో ఎప్పుడో ఒకప్పుడు మనం తొలిసారి ఒక తెలుగు స్టార్‌ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోయిన్‌ ను చూడొచ్చు.. అంటూ అందరూ హ్యాపీగా వెయిట్‌ చూస్తుంటే.. అసలు ఆ ఎక్సయిట్‌ మెంట్‌ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సులు కనిపించట్లేదు. ఎందుకంటే.. తొలిసారిగా వెండితెర మీదన చూస్తున్నాం అనే కిక్‌ మనకు తగలక మునుపే.. ఇలా వెబ్‌ సీరిస్‌ - టివి సీరిస్‌ అంటూ నిహారిక దండయాత్ర చేస్తుంటే.. ఆమె తొలి సినిమా చుట్టూ ఉన్న ఆ హైప్‌ ఒక రేంజులో తగ్గిపోయే ప్రమాదం ఉంది. అసలు వెండితెర సినిమా ఇంకా రిలీజ్‌ కాకుండా నిహారికకు అంత ఆవేశం ఎందుకు అనేవారున్నారు.

బాలీవుడ్‌ లో చూస్తే.. వెండితెర మీద సందడి చేస్తున్నారు అని కన్ఫాం కాగానే.. ఇక టివి యాడ్లు వంటివి నటించడం మానేశారు అనుష్క శర్మ - వాణి కపూర్‌ వంటి తారలు. అందుకే వారి తొలిసినిమాలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. మరి నిహారిక కూడా అలాంటి రూటునే ఫాలో అయితే ఆడియన్సుకు ఫుల్‌ కిక్కొచ్చే ఛాన్సుంది. లేకపోతే యాంకరింగ్‌ నుండి సిల్వర్‌ స్ర్కీన్‌ కు వచ్చిన ఇతర తారల్లా మిగిలిపోయే ప్రమాదమూ ఉంది. ఏమ్మాయ్‌.. అంత ఆవేశం ఎందుకు.. స్లోగా వన్‌ బై వన్‌ చేయొచ్చుగా!!
Tags:    

Similar News