చెయ్ బర్త్ డే సందర్భంగా నిహారిక ఎమోషనల్ పోస్ట్...!

Update: 2020-07-26 12:31 GMT
మెగా నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తనకు పెళ్లి కుదిరిందని నిహారిక సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్నట్లు ఒక్కొక్కటిగా రిలీవ్ చేయడంతో అందరి దృష్టి ఆమె పెళ్లి పై పడింది. చివరికి తనకు కాబాయే వరుడి ఫోటోలను షేర్ చేసి అందరికి పరిచయం చేసింది నిహారిక. ఈ క్రమంలో గుంటూరు ఐజీ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యని మెగా డాటర్ నిహారిక పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి తరచుగా నిహారిక - చైతన్య లకు సంబంధించిన ఏదొక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కాబోయే భర్త చైతన్యతో రొమాంటిక్‌ గా దిగిన ఫోటోను వాల్ పేపర్‌ గా పెట్టుకున్నానని ఇటీవల ఇన్స్టా చిట్ చాట్ లో వెల్లడించింది.

కాగా నేడు చైతన్య బర్త్ డే సందర్భంగా తన కాబోయే భర్తతో దిగిన మరో పిక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది నిహారిక. చైతన్యకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ''నీ చిరునవ్వు గది నిండా వెలుగులు నింపుతుంది. అది సొంత నివాసంలా కౌగిలించించుకుంటుంది. నువ్వు నా హ్యాపీ ప్లేస్ చెయ్. అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి నువ్వు. హ్యాపీ బర్త్ డే లవ్'' అంటూ కాబోయే భర్తకు ప్రేమతో విషెస్ తెలిపింది మెగా డాటర్. ఇక త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం ఉండబోతోందని.. వచ్చే ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం.

Tags:    

Similar News