ఫోటో స్టోరీ: గ్లామర్ టచ్ ఇచ్చిన మెగా డాటర్

Update: 2020-02-13 19:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు.. స్టార్డమ్ సాధించారు.  అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయి నిహారిక.  ఇప్పటి వరకూ నిహారిక 'ఒక మనసు'.. 'హ్యాపీ వెడ్డింగ్'.. 'సూర్యకాంతం' చిత్రాలలో నటించింది కానీ ఆ మూడూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.  అలా అని నిరాశకు గురికాకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమధ్య తన ఫోటోలకు కాస్త గ్లామర్ టచ్ ఇస్తోంది.

ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కాబట్టి నిహారిక మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  మోడరన్ గా ఉండే దుస్తులు ధరించినప్పటికే హాట్ ఫోటో షూట్లు మాత్రం చెయ్యడం లేదు.  కానీ ఈమధ్య ట్రెండ్ మార్చింది. నిహారిక ఇన్స్టా ఖాతాను ఫాలో అయ్యేవారికి ఈ విషయం అర్థం అవుతుంది.  తాజాగా నిహారిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఏస్ ఆఫ్ స్పేడ్స్" అనే క్యాప్షన్ ఇచ్చింది.  ఫోటోలో నిహారిక ఒక మోడరన్ డ్రెస్ ధరించి సూపర్ మోడల్ తరహాలో నిలుచుంది.  సింగిల్ స్లీవ్ ఉండే బ్లాక్ కలర్ టాప్..  బ్లాక్ ప్యాంట్ ధరించి గ్లాస్ విండోస్ దగ్గర పోజిచ్చింది.  ఒక చేతిని తలపై పెట్టుకుని.. మరో చేత్తో బ్యాగ్ పట్టుకుని ఓ హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  రెడ్ కలర్ లిప్ స్టిక్.. స్ట్రెయిటెన్ చేసిన హెయిర్ తో ముంబై భామలా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి స్పందన అదిరిపోయింది. "మెగా హాటీ".. "కిల్లర్ బ్యూటీ ఇన్ బ్లాక్".. "వైల్డ్ నిహారిక" అంటూ కామెంట్లు పెట్టారు.  నిహారిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు కానీ ఇలా గ్లామర్ గేర్ వేసింది కాబట్టి త్వరలో కొత్త ఆఫర్లు రావడం ఖాయమే.
Tags:    

Similar News