ఎన్టీఆర్‌ 30 : కొరటాల మరో మ్యూజికల్‌ ప్రయోగం

Update: 2022-05-20 06:30 GMT
మిర్చి సినిమా తో కొరటాల శివ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా నుండి భరత్ అనే నేను వరకు అన్ని సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి కొరటాల శివ వర్క్ చేసిన విషయం తెల్సిందే. ఇద్దరి కాంబోలో వచ్చిన మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్‌ మంచి మ్యూజికల్‌ హిట్స్ గా నిలిచాయి. అందుకే మళ్లీ వీరిద్దరి కాంబో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఆచార్య సినిమాను చిరంజీవితో చేసిన కొరటాల శివ ఆ సినిమాకు మణిశర్మతో వర్క్‌ చేశాడు. ఆ సినిమా మ్యూజికల్‌ గా పర్వాలేదు అనిపించినా ఓవరాల్‌ ఫలితం అందరికి తెల్సిందే. ఆచార్య ప్లాప్ తో ఎన్టీఆర్‌ 30 సినిమా పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కొరటాల శివ.. ఎన్టీఆర్‌ కాంబోలో ఎప్పుడో మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది. కాని కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.

వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా మ్యూజికల్‌ గా కూడా హిట్ అయ్యింది. అందుకే ఎన్టీఆర్ 30 కి కూడా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అయితే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు. కాని మొదటి నుండి కూడా ఎన్టీఆర్‌ 30 కి తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అయిన అనిరుథ్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన మోషన్ పోస్టర్‌ లో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అనిరుథ్‌ మరో సారి తెలుగు లో తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యాడు.

తమిళనాట టాప్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుథ్‌ ఇప్పుడు తెలుగు లో ఎన్టీఆర్ 30 తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్‌ తో కలిసి కొరటాల శివ చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా బిగ్‌ హిట్స్ ను సొంతం చేసుకున్నాయి. మొదటి సారి మణిశర్మతో కలిసి చేస్తే ప్లాప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఎన్టీఆర్‌ 30 కి కూడా తన మ్యూజికల్‌ ప్రయోగాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈసారి కొరటాల శివ తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్‌ తో వర్క్ చేయబోతున్నాడు. కొరటాల చేయబోతున్న ఈ మ్యూజికల్‌ ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అయ్యోనో చూడాలి.
Tags:    

Similar News