యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందే '#NTR30' ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. వాస్తవంగా తారక్ 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో ఈ ప్రాజెక్టు రూపొందుతుందని గతేడాది వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవడమే కాకుండా కొరటాల శివ లైన్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్ సినిమా లేనందుకు ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ వెంటనే కొరటాల తో సినిమా అనౌన్స్ చేసేసరికి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే డైరెక్టర్ మీద నమ్మకంతో తారక్ స్టోరీ కూడా వినకుండా ఈ సినిమాకి కమిట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో ఎన్టీఆర్ - కొరటాల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా సూపర్ హిట్ అయింది. కలిసి పనిచేయడమే కాకుండా.. సినిమాలకు సంబంధం లేకుండా బయట కూడా స్నేహితులుగా కొనసాగుతుంటారు. అందుకే త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయ్యాక తన 30వ చిత్రానికి కొరటాల లైన్ లోకి వచ్చాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ వినకుండా కొరటాల పై నమ్మకంతో జస్ట్ స్టోరీ లైన్ తో ఈ ప్రాజెక్టుపై సంతకం చేశాడట. త్వరలోనే కొరటాల శివ - తారక్ ఈ సినిమా కథపై చర్చించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ప్యాచ్ వర్క్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు కొరటాల శివ 'ఆచార్య' ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాత 'ఎన్టీఆర్30' మూవీపై కూర్చోనున్నాడు. జూన్ ద్వితీయార్థంలో లేదా జులై ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఎప్పుడు స్టార్ట్ అయినా ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.