డైలాగులు రాసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జనాలకు వినగానే నచ్చేసి పిచ్చ పాపులర్ అయిపోయే డైలాగులు రాయడం కొంతమంది వల్లే అవుతుంది. ఆ టాలెంట్ తనకుందని రచయితగా ఉన్నపుడే రుజువు చేసుకున్నాడు కొరటాల శివ. డైరైక్టర్ అయ్యాక అతడి పెన్ను మరింత పదునెక్కింది. మిర్చి సినిమాలో.. ‘‘వీలైతే ప్రేమిద్దాం డూడ్. మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే’’ అనే డైలాగ్ అప్పట్లో ట్రైలర్ నుంచే జనాల్లోకి ఎక్కేసింది. ఇప్పుడు శ్రీమంతుడు సినిమా కోసం కూడా ఇలాగే ఇన్స్టంట్ గా ఎక్కేసే డైలాగులు రాశాడు కొరటాల.
‘‘బ్యాడ్ అంటే మీలా కాదు.. అదో రకం’’ అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అభిమానుల్లో ఇప్పటికే ఓ మేనియా క్రియేట్ చేసింది. నిన్న రాత్రి నుంచే సోషల్ మీడియా ఈ డైలాగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ‘‘శ్రీమంతుడు హిట్ అంటే అలా ఇలా కాదు. అదో రకం. బ్లాక్ బస్టర్’’ అంటూ పేరడీ డైలాగులు కూడా రెడీ అయిపోయాయి. ట్రైలర్లో వినిపించే మిగతా డైలాగులకు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. ‘‘ఊరి నుంచి చాలా తీసుకున్నా. తిరిగిచ్చేయాలి. లేదంటే లావైపోతా’’ అంటూ శ్రుతి చెప్పే డైలాగ్.. దానికి కొనసాగింపుగా ట్రైలర్ చివర్లో మహేష్ చెప్పే.. ‘‘ఒరేయ్.. ఊరి నుంచి చాలా తీసుకున్నారు. తిరిగిచ్చేయండి. లేదంటే లావైపోతారు’’ అనే డైలాగ్ కూడా ట్రైలర్ కు హైలైట్‌గా నిలిచాయి.
పంచ్ ల కోసం పాకులాడకుండా చాలా సింపుల్ గా ఉంటూనే ఆసక్తి రేపేలా డైలాగులు రాస్తుంటాడు కొరటాల. శ్రీమంతుడు డైలాగుల విషయంలో అతను మరింత శ్రద్ధ పెట్టినట్లున్నాడు. ట్రైలర్ డైలాగులకే ఇంత రెస్పాన్స్ ఉంటే.. ఇక సినిమా చూస్తున్నపుడు అభిమానుల హంగామా ఇంకెలా ఉంటుందో మరి.