టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉందట. ఇక ఈ చిత్రాన్ని దసరా బరిలో దించాలని మేకర్స్ ప్లాన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. చిరంజీవి - చరణ్ గతంలో తెరపై కలిసి కనిపించారు కానీ కొంత నిడివిగల పాత్ర చేయలేదు. మగధీర - బ్రూస్ లీ వంటి చరణ్ సినిమాలో చిరు క్యామియో రోల్స్ లో కనిపించి అలరించారు. కానీ ఆచార్య చిత్రంలో చరణ్ దాదాపు అరగంట నిడివి గల కీలక రోల్ చేస్తున్నారట. మరి ఈ చిత్రంలో చిరు చరణ్ ల బంధం ఎలా ఉంటుందని అందరి సందేహం. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఏమై ఉంటుంది అనే ఆలోచన ప్రేక్షకులలో మొదలైంది.
అయితే ఇటీవల చరణ్ రోల్ పై చిరంజీవి అనేక విషయాలు చెప్పి క్లారిటీ ఇచ్చారట. చరణ్ ఈ సినిమాలో కొడుకుగా కనిపిస్తాడని అందరూ భావించారు. కానీ చిరు-చరణ్ ఆచార్యలో గురు శిష్యులుగా కన్పించనున్నట్లు తెలిపారట మెగాస్టార్. దీనితో ఆచార్యలో చరణ్ రోల్ పై అభిమానులకు ఓ స్పష్టత వచ్చినట్లే అన్పిస్తుంది. కానీ ఆచార్య దర్శక నిర్మాతలు మాత్రం ఇలా ముందే సినిమా విషయాలు లీక్ చేస్తే ఎలా చిరు సార్? అంటూ తలలు బాదుకుంటున్నారట. మరో విధంగా ఆలోచిస్తే ఇలా లీక్ చేయడం కూడా సినిమా పై అంచనాలు పెంచడానికి ఉపయోగ పడుతుందిలే అని సర్ది చెప్పుకుంటున్నారట. గతంలో ఈ పాత్ర మహేష్ చేస్తున్నారని ప్రచారం జరిగినా అది నిజం కాదని చిరు చెప్పుకొచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఈ లీక్ విషయాలు సినిమా పై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో...