జోరు పెంచేందుకు ‘సై’రా

Update: 2018-06-18 11:19 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో.. ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న చిత్రం సైరా.. నరసింహారెడ్డి. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథతో తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేసినా క్వాలిటీని దృష్టిలో పెంచుకుని నెమ్మదిగా షూట్ చేస్తూ వస్తున్నారు.

మెగాస్టార్ కు ఇంతవరకు వేరే కమిట్ మెంట్స్ ఏమీ లేకపోవడంతో సైరా షూటింగ్ నెమ్మదిగానే సాగింది. ఇప్పుడు నాలుగు వరస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న కొరటాల శివ మెగాస్టార్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. దాంతో చిరంజీవి ఇప్పుడు సైరా మూవీ షూటింగ్ స్పీడు పెంచాల్సిందిగా డైరెక్టర్ సురేందర్ రెడ్డిని అడిగాడని తెలుస్తోంది.  ఈ ఏడాది ఆఖరుకు కొరటాల శివ సినిమా షూటింగ్ స్టార్టు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఒక్కసారి కొరటాల షూటింగ్ మొదలుపెట్టాడంటే చకచకా పని పూర్తి చేసుకుంటూ వెళ్లిపోతాడు. అందుకనే కొరటాలతో షూటింగ్ మొదలెట్టే ముందు గ్రాఫిక్ వర్క్ తప్ప సైరా పని మొత్తం పూర్తి చేయాల్సిందిగా సురేందర్ రెడ్డి టీం మొత్తం పైన మెగాస్టార్ ఒత్తిడి పెంచుతున్నాడట.

మరోవైపు సురేందర్ రెడ్డికి కూడా సైరా సినిమా పనిలో వేగం పెంచాల్సిన అవసరం వచ్చింది. అతడికి తరవాత ఛాన్స్ కూడా మెగా కాంపౌండ్ లోనే దొరికింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని సురేందర్ రెడ్డికి కబురు వచ్చింది. అందుకే సైరా త్వరగా పూర్తి చేసి బన్నీ సినిమా స్క్రిప్ట్ పని స్టార్ట్ చేసేందుకు సురేంద్ రెడ్డి సిద్ధం అవుతున్నాడు.  



Tags:    

Similar News