ఇప్పటివరకు మహేష్ బాబు చాలాసార్లు వాయిస్ ఓవర్ చెప్పాడు. పవన్ కళ్యాన్‌జల్సా సినిమాకు.. ఎన్టీఆర్ బద్షా సినిమాకు.. ఇలా తనకు ప్రియమైన డైరక్టర్లు రిక్వెస్ట్ చేయడంతో.. ఆ సినిమాల్లో హీరోలు ఎవరైనప్పటికీ తాను వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ కోసం తన గొంతు అరువిస్తున్నాడని గత నాలుగు రోజులుగా ఫిలిం నగర్ లో హోరెత్తిపోతోంది. ఇందులో నిజం ఉందా?
అబ్బే లేదు. అసలు ఇప్పటివరకు ''జనతా గ్యారేజ్'' సినిమా కోసం ఒక వాయిస్ ఓవర్ పెట్టాలని కాని.. అసలు ఈ వాయిస్ ఓవర్ కోసం మహేష్ బాబును ఎప్రోచ్ అవ్వడం కాని జరగలేదట. దర్శకుడు కొరటాల శివతో మహేష్ బాబుకు మాంచి సాన్నిహిత్యమే ఉంది. శ్రీమంతుడు సినిమా అంత పెద్ద హిట్టయ్యాక ఏకంగా ఆడీ కారును గిఫ్టుగా ఇచ్చాడు మహేష్. ఇప్పుడు ఆ దర్శకుడు అడిగితే వాయిస్ ఓవర్ చెప్పడానికి పెద్దగా కాదనడు. కాని అసలు అలాంటి ఆలోచనలే ఇంతవరకు పుట్టలేదని కొరటాల టీమ్ చెబుతోంది.
ఒకవేళ మహేష్ కానివ్వండి.. లేదా ఇంకెవ్వరైనా హీరో కానివ్వండి.. సినిమా కోసం వాయిస్ ఓవర్ చెబితే మాత్రం ఆ న్యూస్ ముందుగా మేమే తెలియజేస్తాం అంటున్నాడు కొరటాల శివ. అది సంగతి.