రెండో సినిమాకే మహేష్ లాంటి స్టార్‌తో పని చేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నాడు యంగ్ డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి లాంటి సూపర్ హిట్‌తో అరంగేట్రం చేసి.. ఇప్పుడు మహేష్ తో ‘శ్రీమంతుడు’ తీసిన కొరటాల.. ఎంతో కష్టపడి రాసిన ఈ కథకు ప్రేక్షకుల నుంచి కచ్చితంగా మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ కొరటాల ఏమన్నాడంటే..
‘‘డైరెక్టర్ గా నా రెండో సినిమానే మహేష్ లాంటి సూపర్ స్టార్‌తో చేసే అవకాశం రావడం నా అదృష్టం. శ్రీమంతుడు చాలా కష్టపడి రాసిన కథ. చాలా టైం తీసుకున్నాను. ఈ కథ మహేష్ కు చెప్పినపుడు ఆయన వెంటనే ఒప్పుకుంటారని అనుకోలేదు. కొన్ని మార్పులైనా చెబుతారని అనుకున్నా. కానీ ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. ఇలాంటి మంచి కథను, క్లిష్టమైన కథను కమర్షియల్ గా భలే గా చెప్పారే అన్నారు. జగపతి బాబు గారు మహేష్ కు అన్నలా అనిపిస్తారు. ఆయన తండ్రి పాత్రకు ఒప్పుకుంటారా అని సందేహం కలిగింది. కానీ ఆయన కూడా సంతోషంగా ఈ సినిమాకు ఒప్పుకున్నారు. మహేష్ ట్రెజర్ లాంటి వాడు. అతణ్ని పెట్టి భారీ కాన్వాస్ లో ఈ సినిమా తీయగలిగానంటే అందుకు నిర్మాతలు అందించిన సహకారమే కారణం. దేవిశ్రీతో చాలా ఎక్కువ సమయం ట్రావెల్ చేశాను. సినిమాకు అందరూ సహకరించారు. శ్రీమంతుడు కచ్చితంగా అభిమానుల్ని అలరించే సినిమా అవుతుంది’’