కొర‌టాల గ‌ట్స్‌ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Update: 2015-08-24 10:14 GMT
మ‌హేష్‌ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసి హిట్టు కొట్టాక ఆ ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌లు ఏ రేంజ్‌ లో ఉంటాయో ఓసారి ఊహించుకోండి. మ‌రింత మంది స్టార్ హీరోల‌తో సినిమాలు తీయాల‌ని, బాలీవుడ్‌ కీ వెళ్లి దున్నేయాల‌నీ, సినిమా సినిమాకీ రేంజ్ పెరిగిపోవాల‌నీ ఇలా చాలా చాలా ఆలోచిస్తుంటారు. కానీ కొర‌టాల శివ మాత్రం `శ్రీమంతుడు`లాంటి స‌క్సెస్  త‌ర్వాత కూడా  భూమ్మీదే న‌డుస్తున్నాడు. క‌థ కుదిరితే విశాల్‌తో సినిమా చేయాలనుంద‌ని చెప్పుకొచ్చాడు.
విశాల్‌కి త‌మిళంలో క్రేజ్ ఉందేమో కానీ.. తెలుగులో మాత్రం ఆయ‌న చిన్న హీరోనే. ఇప్ప‌టిదాకా నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయ‌లేదు. డ‌బ్బింగ్ సినిమాల‌తోనే మార్కెట్ క్రియేట్ చేసుకొన్నాడు. అలాంటి హీరోతో కొర‌టాల శివ సినిమా చేస్తాన‌ని ఓపెన్‌ గా ప్ర‌క‌టించ‌డం చూసి `ఆయ‌న గ‌ట్స్‌ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ` అని మాట్లాడుకొన్నారు సినీ జ‌నాలు.

విశాల్ క‌థానాయ‌కుడిగా `జ‌య‌సూర్య‌` అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి నిర్మాత‌గా మారి ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌ లో పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. నాగేశ్వ‌రరెడ్డి ద‌గ్గ‌ర ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన కొర‌టాల శివ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ``విశాల్ కోసం అప్ప‌ట్లో క‌థ‌లు రాసుకొనే వాడిని. ఆయ‌న‌తో ర‌చ‌యిత‌గా సినిమా చేయాల‌ని అనుకొనేవాణ్ని. కానీ అప్ప‌ట్లో కుద‌ర‌లేదు. మంచి క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా సినిమా చేస్తా`` అన్నారు. ద‌ర్శ‌కుడు కాక‌ముందు విశాల్‌ తో సినిమా చేయాల‌ని ఆశ‌ప‌డ‌టంలో త‌ప్పు లేదు కానీ... మ‌హేష్‌, ప్ర‌భాస్‌ లాంటి హీరోల‌తో సినిమాలు తీశాక‌, హిట్లు కొట్టాక కూడా శివ ఆ మాట చెప్ప‌డం నిజంగా గ్రేట్ అంటున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు విశాల్‌. కొర‌టాల శివ‌లాంటి ద‌ర్శ‌కుడు తోడ‌య్యాడంటే మాత్రం విశాల్ టాలీవుడ్‌ లోనూ వెలిగిపోవ‌డం ఖాయం.
Tags:    

Similar News