సీనియర్ మూవీ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాసరావు.. ప్రస్తుత జనరేషన్ హీరోలు, వాళ్ల డ్యాన్స్‌లపై తన స్టైల్లో ఫైరైపోయారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన నేటి సినిమాల్లో వస్తోన్న డ్యాన్సులు - మేకప్ తదితర అన్ని విషయాలపైనా తన మనసులో మాట వెల్లడించారు. ప్రస్తుత హీరో నేలపై దొర్లుతున్నాడండీ అంటూ మొదలు పెట్టి.. హీరోయిన్ ముందు అలా దొర్లడం - పడిపడి కొట్టుకోవడం ఎందుకని ప్రశ్నించారు. గతంలో మూవీల్లో ఎక్కడా హీరోయిన్ ముందు హీరో నేలపడి పోవడం.... కొట్టుకోవడం వంటివి లేవని చెప్పారు. ఎంత ట్రెండ్ మారినా ఇలాంటి డ్యాన్సులు చూడాలంటే కొంత ఎబ్బెట్టుగా ఉంటుందని ఆయన అన్నారు.
తన లాంటి వాళ్లు ఇవేంటని అడిగితే ఫ్లోర్ డ్యాన్స్ అని చెబుతున్నారని, అలాంటి డ్యాన్సులు ఎందుకంటే మాత్రం ఆన్సర్ ఉండదని అన్నారు. అసలు హీరోలు చేస్తున్న డ్యాన్సులకి ఎలాంటి రూల్సూ లేవని కోటా చమత్కరించారు. ఇక, గ్రూపు డ్యాన్సులపైనా కోటా మండిపడ్డారు. అవసరం ఉన్నా లేకున్నా.. గ్రూపు డ్యాన్సులు హోరెత్తుతున్నాయని విమర్శించారు. ప్రతి పాటకీ వెనక ఓ 50 మంది డ్యాన్సర్లు ఉండాల్సిందేనని, అంతమంది ఎందుకు అని కోటా ప్రశ్నించారు. అయితే, సదరు మూవీ హీరో కానీ - డైరెక్టర్ కానీ ఆ యాభై మందీ ఉంటే తప్పేంటి? అని ఎదురు అడుగుతున్నారని కోటా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, మేకప్ పైనా తన అసహనాన్ని వ్యక్తం చేశారు కోటా. ఖైదీ వేషం వేసే నటుడుకి మేకప్ తో పనేంటని కోటా ప్రశ్నించారు. ఖైదీ అంటే మాసిన గడ్డం - మాసిన జుట్టుతో ఉంటాడని - దీనికి కూడా మేకప్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చిన్న మేకప్ లకు కూడా ముంబై నుంచి మేకప్ మెన్లను దిగుమతి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ తనను తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు. పోనీ ఏమన్నా మంచి మాటలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదిలావుంటే, గతంలోనూ కోటా టాలీవుడ్ పై కారాలు మిరియాలు నూరారు.
ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇక్కడ ఉంటే వేరే భాషల నుంచి ఇక్కడకి దిగుమతి చేస్తున్నారని, వాళ్లకి అసలు తెలుగులో డైలాగులు కాదుకదా కనీసం చిన్నపాటి మాటలు కూడా చెప్పడం రాదని, అలాంటి వాళ్లను పెట్టుకుని లక్షలకు లక్షలకు కుమ్మరిస్తున్నారని... మన వాళ్లకు పొరుగింటి పుల్లకూర రుచి అని టాలీవుడ్ పై ఫైరయ్యారు. ఇప్పుడు ఆయనలో ఆ అసహనం మరింత పెరిగిందనే చెప్పాలి. మరి కోటా మాటలు ఎవరైనా పట్టించుకుంటారో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/