లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లారు. కెరీర్ ఆరంభంలో అప్పుడప్పుడే తాను నటుడిగా పేరు తెచ్చుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టిన ‘ప్రతిఘటన” గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా ఇప్పుడొస్తే ‘బాహుబలి”ని మించిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సినిమాను నిర్మించిన రామోజీరావుతో తన తొలి కలయికను కూడా కోట గుర్తు చేసుకున్నారు.
‘’ప్రతిఘటన సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే ‘బాహుబలి’ని మించిపోయేది. ఎందుకంటే అప్పట్లో రూపాయి విలువ వేరు. ఇప్పుడు వేరు. పోల్చి చూస్తే ఆ సినిమా బాహుబలి లెవెల్ హిట్ అన్నమాట. అప్పట్లో ఆ సినిమా అలా ఆడింది. మౌత్ టాక్ ద్వారానే సినిమా బాగా జనాల్లోకి వెళ్లింది. అలాగే రామోజీరావు గారు కూడా పబ్లిసిటీ బాగా చేశారు. ‘ప్రతిఘటన’ వంద రోజుల వేడుకలో తొలిసారి రామోజీరావు గారిని కలిశాను. అప్పటిదాకా ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. శతదినోత్సవంలో ఆయన్ని కలిసినపుడు చాలా ఆనందపడ్డారు. నన్ను అభినందించారు. ‘బాగా చేశారండీ. సినిమా చూసిన వాళ్లందరూ మీ గురించి అడుగుతున్నారు. చాలా మంచి పేరు వచ్చింది మీకు. భవిష్యత్తులో మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. బాగా బిజీ అవుతారు. మీతో పరిచయం బాగుంది’ అని చాలా సంతోషంగా చెప్పారు రామోజీరావు గారు. ఆయన వాక్కులు ఫలించి నటుడిగా బిజీ అయ్యాను” అని కోట తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/