కోటకి ఇది అరుదైన గౌరవం

Update: 2015-04-08 23:30 GMT
విలనీ చేయాలన్నా, కామెడీ పండిరచాలన్నా కోట తర్వాతే. తురుపుముక్క లాంటి నటుడు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఎక్కడైనా తనదైన శైలితో విజృంభించిన నటుడాయన. దేశవిదేశాల్లో మెప్పు పొందిన గొప్ప విలక్షణ నటుడాయన. 500పైగా సినిమాల్లో నటించి కెరీర్‌లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఆరుసార్లు ప్రతిష్ఠాత్మక నందులు అందుకున్నారు. సినిమాకి ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చి గౌరవించింది.

ఆ అవార్డును అందుకోవడానికి ఢల్లీి వేదిక అయ్యింది. పద్మశ్రీ పురస్కారాన్ని నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు కోట. ఇలాంటి సందర్భం ప్రతి నటుడి జీవితంలో చాలా అరుదైనది. ఎమోషనల్‌ అనిపించే సందర్భం. ఒక గొప్ప నటుడికి ఘనమైన సత్కారం ఇది. తెలుగువారంతా గర్వించదగిన గొప్ప సందర్భం. పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ లాంటి అవార్డులకు కోట అర్హుడు. అయితే పద్మశ్రీ రావడమే చాలా ఆలస్యమైంది. నేను ఎక్కిన రైలు ఆర్నెళ్లు ఆలస్యం అన్నట్టుంది ఈ అవార్డుల వ్యవహారం. మిగతా వాటి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News