కోట శ్రీ‌నివాస‌రావు ముఖంపై ఉమ్మేసిన బాల‌య్య‌

Update: 2021-08-22 15:30 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సెంటిమెంట్ల గురించి ఆయ‌న ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం ఉంది. చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం ఓపెన్ గా ఉండే త‌త్వం అని కొంద‌రు చెబుతారు. అప్పుడ‌ప్పుడు కోపం వ‌చ్చినా ఆయ‌న తీరు అలానే ఉంటుంద‌ని విమ‌ర్శ‌లున్నాయి. బాల‌య్య అంత మంచి వ్య‌క్తి ఉండ‌రు.. మాటిచ్చారంటే అని ప్ర‌శంసించేవాళ్లు లేక‌పోలేదు. ఆయ‌న ప్ర‌శాంతంగా ఉంటే ఎంతో సౌమ్యంగా మెలుగుతారు. సాయం కోరితే వెంట‌నే స్పందిస్తారు. సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డంలో లెజెండ్ ఎప్పుడూ ముందుంటారు. బాల‌య్య లో ఇలా రెండు పార్శ్వాలున్నాయి.

అయితే తాజాగా సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బాల‌య్యలోని ఒక కోణం గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఓసారి కోట శ్రీనివాస‌రావుపై బాల‌య్య కాండ్రించి ముఖంపైనే ఉమ్మేసారుట‌. ఈ ఘ‌ట‌న రాజ‌మండ్రిలో జ‌రిగింది. బాల‌య్య ఏదో సినిమా ప‌నిమీద వెళ్లారుట‌. అదే స‌మ‌యంలో కోట కూడా జంధ్యాల సినిమా కోసం  అక్క‌డే ఉన్నారుట‌. పోద్దుటే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌క్క‌కు త‌ప్పుకోమ‌ని సైగ‌లు చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఇటువైపు బాల‌య్య బాబు వ‌స్తున్నారు. నేను గౌర‌వంగా న‌మ‌స్కారం బాబు అన్నాను. అంతే వెంట‌నే ఆయ‌న కాండ్రించి ముఖం మీద‌నే ఉమ్మాడు. ఏం చేస్తాం... ఏమీ చేయ‌లేం అని అక్క‌డ నుంచి వ‌చ్చేసాను... అని బేల‌గా చెప్పారు.

అయితే బాల‌య్య అలా చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఎన్టీఆర్ మొద‌టిసారి సీఎం అయిన‌ప్పుడు మండ‌లీశ్వ‌రుడు అనే సినిమా చేసాను. అందులో ఎన్టీఆర్ పాత్ర పోషించాను. అది చాలా వివాదాస్ప‌ద‌మైంది. విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ అభిమానులు కూడా కొట్టారు. ఓఫ్యాన్ అయితే గుండెల‌పైకి ఎక్కి చెప్పుతో కొట్టాడు. అలాగే బాల‌య్య‌కి కోపం వ‌చ్చి ఉమ్మాడు.  ఆ వేషం వేయ‌డం నా త‌ప్పుకాదు. డైరెక్ట‌ర్ అలా చేయించాడు. అలాగని నేను బాధ‌ప‌డ‌లేదు. ఇది వృత్తి. ఇక్క‌డ అలాగే ఉండాలి అని కోట తెలిపారు. ద్యావుడా.. నిజాయితీ ప‌రుడైన న‌టుడికి ఎన్ని కష్టాలు!!
Tags:    

Similar News