సెట్స్ లోనే దర్శకుడి కొత్త కాపురం

Update: 2016-11-17 09:30 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తూనే.. దర్శకుడు క్రిష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారాల వ్యవధిలోనే తిరిగి షూటింగ్ మొదలుపెట్టేశాడు దర్శకుడు. ఇంకా క్రిష్-రమ్యల పెళ్లికి వంద రోజుల పండుగ కూడా పూర్తి కాలేదు.

ఇప్పుడు శాతకర్ణి హీరోయిన్ శ్రియ చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కలిగిస్తోంది. 'మిసెస్ క్రిష్ తో చివరి రోజు. రమ్య ఎంతో అందమైన వ్యక్తి' అంటూ.. క్రిష్ వైఫ్ తో కలిసి దిగిన ఫోటోను శ్రియా శరణ్ పోస్ట్ చేసింది. దీనికి ఆమె నుంచి రిప్లై కూడా వచ్చింది. 'థాంక్య్ లవ్. నేను కలిసిన అందరిలో నువ్వు అద్భుతమైన మహిళవు. అంతకంటే అందమైన మనసు నీకు ఉంది. ఐ మిస్ యూ' అంటూ డాక్టర్ రమ్య కామెంట్ చేసింది. ఇదంతా చూస్తుంటే.. సెట్స్ లో శ్రియ-రమ్యలు ఎంతగా కలిసిపోయారనే విషయంతో పాటు.. క్రిష్ భార్య కూడా సెట్స్ లోనే ఉంటోందనే విషయం అర్ధమైపోతోంది.

శాతకర్ణి షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసినప్పటి నుంచి.. దాదాపుగా యూనిట్ తోనే ఉందిట రమ్య. ఇలా తన కొత్త కాపురాన్ని సెట్స్ లో ప్రారంభించారు క్రిష్ అండ్ రమ్య. బాగుంది కదూ ఈ జంట కొత్త కాపురం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News