ఈ తరంలో బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఏకైక తెలుగు దర్శకుడు క్రిష్. ఇంతకుముందే ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా చేశాడతను. ‘ఠాగూర్’కు రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం అంత మంచి ఫలితాన్నివ్వలేదు. అలాగని అతనేమీ ప్రయత్నం ఆపలేదు. ఈసారి రాణీ రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే ప్రెస్టీజియస్ మూవీతో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు క్రిష్. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ‘మణికర్ణిక’ను ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నారు. ఇంతకుముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ ఆ తేదీకి సినిమా రావడం డౌటే అంటున్నారిప్పుడు.
మామూలుగానే షూటింగ్ కొంత ఆలస్యంగా నడుస్తుండగా.. ఇప్పుడు రాజస్థాన్ లో చేస్తున్న కొత్త షెడ్యూల్ షూటింగుకి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఓ వర్గం అక్కడ షూటింగ్ ఆపించేసినట్లు సమాచారం. ఈ గొడవ సద్దుమణిగే వరకు షెడ్యూల్ ఆపేస్తున్నారట. గతంలో ‘పద్మావతి’ సినిమాకు కూడా ఇలాగే అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘మణికర్ణిక’ అనుకున్న తేదీకి రావడం కష్టమే అంటున్నారు. ఏప్రిల్ 27న ‘కాలా’.. ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అనే నేను’ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదిన ‘మణికర్ణిక’ విడుదలకు ఇబ్బందులు తప్పవు. ఆ రకంగా చూసినా కూడా ఏప్రిల్ 27న రిలీజ్ చేయడం దీనికి ఇబ్బందే. కాబట్టి ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్దానికి వాయిదా వేస్తారని అంటున్నారు. కాబట్టి ‘మణికర్ణిక’ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న క్రిష్.. ఇక్కడికి రావడానికి మరింత సమయం పడుతుందన్నమాట.