ఎన్టీ రామారావు జీవితాన్ని తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు క్రిష్ - బాలకృష్ణలు ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించిన చిత్రం అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో చేయాలని భావిస్తున్నారు. సినిమా విడుదలకు అటు ఇటుగా నెల రోజుల సమయం ఉంది. ఇప్పటి నుండే సినిమాకు ప్రమోషన్ మొదలు పెట్టారు.
ఈనెల 16వ తారీకున హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు, ఆ తర్వాత నిమ్మకూరులో ఆడియో విడుదల కార్యక్రమాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సినిమాలకు గత కొంత కాలంగా కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరులో భారీగా ఆధరణ దక్కుతున్నాయి. సీడెడ్ స్థాయిలో అక్కడ కొన్ని సినిమాలు వసూళ్లు దక్కించుకుంటున్నాయి. అందుకే ‘ఎన్టీఆర్’ సినిమాను అక్కడ భారీగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.
సినిమా విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు బెంగళూరులో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా భారీగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం లేదా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరులో నందమూరి ఫ్యాన్స్ భారీగా ఉంటారు. అందుకే ఫ్యాన్స్ తో భారీగా వేడుక చేయాలని కూడా కొందరు కోరుతున్నారట. దాంతో బెంగళూరులో సినీ వేడుక జరుపుకోబోతున్న తెలుగు సినిమాగా ‘ఎన్టీఆర్’ నిలువబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.