పెద్ద తెర.. బుల్లితెర అవకాశాలు లేకపోయినా.. ఇటీవల ఓటీటీ- ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదికలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నటీనటులతో పాటు.. దర్శకులంతా ఈ కొత్త దారిని ఎంచుకుంటున్నారు. పెద్ద తెరపై తమకు క్రేజు ఉన్నా లేకపోయినా పలువురు దర్శకులు వెబ్ సిరీస్ లతోనూ ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇదే బాటలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కూడా వెళుతున్నారు.
ఇప్పటికే నందిని రెడ్డి.. సంకల్ప్ రెడ్డి.. దేవా కట్టా.. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు వెబ్ సిరీస్ బాటలో ఉన్నారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తర్వాత పలువురు స్టార్లకు కథలు వినిపించినా ఏదీ వర్కవుట్ కాలేదు. పవన్ కల్యాణ్.. రామ్ చరణ్ లాంటి స్టార్లను సంప్రదించినా ఎవరూ అవకాశాలివ్వకపోవడం నిరాశపరిచింది. ఆ క్రమంలోనే క్రిష్ వెబ్ సిరీస్ నిర్మాణానికి రెడీ అయ్యారు.
అంతేకాదు .. ఒక సినిమాకి పెడుతున్నంత బడ్జెట్ పెడుతున్నారు దీనికి. పైగా ఫేడవుట్ స్టార్లందరికీ క్రిష్ అవకాశాలిస్తున్నాడు. నవదీప్-బిందుమాధవి-హెబ్బా పటేల్- తేజస్వి మదివాడ లాంటి తారలకు అవకాశం కల్పిస్తూ దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ని ఆయన నిర్మిస్తున్నారు. తాజా వెబ్ సిరీస్ కి దడ లాంటి ఫ్లాప్ సినిమాతో తెరమరుగైన అజయ్ భుయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ రచనా సాయం చేస్తున్న ఈ వెబ్ సిరీస్ అర్బన్ కామెడీ థ్రిల్ బేసిస్ లో తెరకెక్కుతోందట.