గంగ సాక్షిగా క్వీన్ ఝాన్సీ మొదలైంది

Update: 2017-05-05 06:19 GMT
క్రిష్ జాగర్లమూడి.. హిందిలో కూడా బాగా పేరు ఉన్న తెలుగు డైరెక్టర్. గమ్యం సినిమాతో తెలుగులో ఒక కొత్త వరవడికి మార్గం వేసిన ఇతడు.. వేదంతో తన భాణి ఏంటో చెప్పి గౌతమీపుత్ర శాతకర్ణి తో తను  ఏ స్థాయీ ఫిల్మ్ మేకింగ్ చేయగలడో నిరూపించాడు. అలాగే హిందీలో కూడా గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో మంచి విజయం సాధించాడు క్రిష్.

ఇప్పుడు అతను చరిత్రలో ప్రసిద్ధచెందిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి బయో పిక్ ని సినిమాగా తీయబోతున్నాడు. ఈ సినిమాలో ఝాన్సీగా బాలీవుడ్ క్వీన్ నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంభందించిన పోస్టర్ ను నిన్ననే విడుదల చేశారు. మనికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే టైటిల్ తో బ్యాక్ గ్రౌండ్ లో కంగనా రనౌత్  ఝాన్సీ గా కనిపించి అందరినీ అబ్బురపరిచింది. ఇక నిన్న సాయంత్రం కాశీలో గంగా నది ఒడ్డున స్పెషల్ పూజలతో ఈ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు.

సౌత్ లో క్రిష్ కి మంచి పేరు ఉంది. మనికర్ణిక తెలుగులో పాటుగా తమిళ్ హిందీ లో కూడా విడుదల చేస్తారట. బాహుబలి వేసిన దారిలో చాలా సినిమాలు బిజినెస్ ఆ విదంగా ప్లాన్ చేస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల అవుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి కంచి లాంటి  హిస్టారికల్  సినిమా తీసిన క్రిష్ ఇప్పుడు మరో హిస్టారికల్ మూవీ మనికర్ణిక శ్రీకారం చుట్టాడు.. రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News