టాలీవుడ్ లో ప్రయోగాల హీరోగా, ఛాలెంజింగ్ స్టార్ గా సూపర్ స్టార్ కృష్ణకి పేరుంది. ఠఫ్ పోటీలోనూ ఛాలెంజ్ చేసి మరీ సినిమాలు తీసిన హీరోగా - నిర్మాతగా కృష్ణ గురించి చెబుతుంటారు. 80 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో ఆయన రియల్ సూపర్ స్టార్. సవాళ్లకు ఎదురెళ్లి ధీరుడిలా నిలబడేవాడే విజేత.. ఆ కోవకి చెందిన మొదటి తెలుగు హీరో అతడే. అందుకే ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ లెగసీని కాపాడుతూ స్టార్ డమ్ ని వంద రెట్టు పెంచాడు ప్రిన్స్ మహేష్. సూపర్ స్టార్ల వంశం మాది అని ప్రూవ్ చేశాడు.
ఓమారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగానే బుల్లి ప్రిన్స్ గా మహేష్ వెండితెరపైకి ఆరంగేట్రం చేశాడు. కొడుకు దిద్దిన కాపురం - జేమ్స్ బాండ్ 007 లాంటి సినిమాల్లో నటించాడు. తండ్రి కొడుకులిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తూ పరిశ్రమని ఏలారు. కట్ చేస్తే ఇటీవలి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు దూరమయ్యారు. అతడు ముఖానికి రంగేసుకుని చాలా కాలమే అయ్యింది.
ఇన్నాళ్టికి సీనియర్ దర్శకులు ముప్పలనేని శివ ప్రేరణతో -శ్రీశ్రీ అనే చిత్రం కోసం తిరిగి ముఖానికి రంగేసుకున్నారాయన. ఈ చిత్రంలో విజయనిర్మల కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ సాగుతోంది. అయితే సేమ్ ప్లేస్ మహేష్ హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం షూటింగ్ జరగుతోంది. తండ్రి కొడుకు ఒకే లొకేషన్ లో ఇలా షూటింగులు చేసుకోవడం అనేది అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేదే. ఇలాంటి సన్నివేశం అరుదైనది. గ్రేట్ ఫాదర్ అండ్ సన్.