అక్కడికి వెళిపోతానంటున్న డైరక్టర్

Update: 2018-06-01 06:17 GMT
టాలీవుడ్ లో ఒకప్పుడు కృష్ణ వంశీ డైరెక్షన్లో ఒక సినిమా వస్తోంది అంటే మినిమమ్ హిట్ అనే టాక్ ఉండేది. స్టార్స్ లేకపోయినా చందమామ అనే సినిమాను మంచి హిట్ చేసిన ఘనత ఆయనది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆడియెన్స్ యొక్క పల్స్ మిస్ అయ్యిందో ఏమో మరి మొత్తానికి వరుస ఫెయిల్యూర్స్ అందుకున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ప్లాన్స్ వేసుకున్నా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. దీంతో ఈ తెలుగు దర్శకుడు దాదాపు సినిమాలకు ఎండ్ చెప్పినట్లే అని టాక్ వస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా కృష్ణవంశీ సోషల్ మీడియా లో ట్వీట్ చేసిన విధానం వైరల్ అవుతోంది. స్విజర్ ల్యాండ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేసి చివరికి స్విజర్ ల్యాండ్ లో సెట్ అయిపోవాలని అనుకుంటున్నా అని చెప్పాడు. అందుకు ఒక వివరణ కూడా ఇచ్చాడు. చిల్లిడ్ క్లైమేట్  సిగరెట్ రమ్..హై అండ్ హోమ్ థియేటర్ కొన్ని గొప్ప చిత్రాలు హాలీవుడ్ బాలీవుడ్ పప్పుచారు ఉప్పుచేప ఆవకాయ్ అండ్ గడ్డ పెరుగు అండ్ కంఫర్ట్ బెడ్.. ఇంకేమి వద్దు అని కృష్ణ వంశీ తెలిపాడు.

అయితే కృష్ణ వంశీ  చెప్పిన విధానానికి సీనియర్ యాక్టర్ సుమలత తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది. సుమలత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతమణి. అయితే ఆమె మీటూ మీటూ అంటూ చెప్పడంతో కృష్ణ వంశీ వెంటనే రిప్లై ఇచ్చాడు. ష్.. ముందు ని కుమారుడిని జాగ్రత్తగా చూసుకో.. స్క్రిప్ట్ విను.. స్క్రిప్ట్ డిసైడ్ చేసి రెబల్ స్టార్ కోసం ఆలోచించు అని చెబుతూ.. నో నో ..అది వర్కౌట్ కాదు. అందుకని మీరు ఇక్కడే ఉండాలని కృష్ణ వంశీ సమాధానం ఇచ్చారు.
Tags:    

Similar News