ఎలాంటి సినిమా అయినా సరే ఇటీవల కాలంలో ప్రమోషన్స్ చేయనిదే సినిమా జనాల్లోకి అసలు వెళ్లడం లేదు. సినిమా రిజల్ట్ అనేది తర్వాత సంగతి ముందు సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల కాలంలో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. జాతి రత్నాలు సినిమాకు ఒక విధంగా ప్రమోషన్స్ అయితే చాలా ఉపయోగపడింది. ఇక విజయ్ దేవరకొండ మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ అనేసరికి ఏ స్థాయిలో ఊగిపోతాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా యువతను ఆకట్టుకొని విధంగా అతను కాలేజీలకు అలాగే డైరెక్ట్ గా రోడ్ల పైన కూడా ప్రమోషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో విశ్వక్సేన్ కూడా ప్రమోషన్స్ చేసే మంచి గుర్తింపునందుకున్నాడు. ఏదేమైనా కూడా కంటెంట్ బాగుంటేనే సినిమాకు చూసేందుకు జనాలు వస్తారు అనేది తర్వాత విషయం కానీ ఏదో ఒక విధంగా యువతకు దగ్గర అయ్యేలా సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ప్రమోషన్స్ చేయడం ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయింది.
అయితే అందరూ ఒక తరహాలో ప్రమోహన్స్ చేస్తుంటే యువహీరో నాగశౌర్య మాత్రం కేవలం రొటీన్ తరహా ప్రమోషన్ చేస్తూ ఉండడం కొంత నిరాశను కలిగిస్తోంది. ఆ మధ్య అతను చేసిన వరుడు కావలెను సినిమా కోసం డైరెక్ట్ గా కొన్ని పెళ్లి ఈవెంట్స్ కు వెళ్లి సినిమా ప్రమోషన్ చేశాడు. అదేదో పిలవని పేరంటం అనుకుంటే గొప్ప అని చెప్పవచ్చు. కానీ ముందస్తుగానే ప్లాన్ చేసుకొని ఒక పలుకుబడి ఉన్న ఫ్యామిలీ పెళ్లిళ్లకు హాజరు కావడం సినిమాకు ఏ మాత్రం బజ్ క్రియేట్ చేసింది లేదు.
ఎవరైనా మిడిల్ క్లాస్ పెళ్లిళ్లకి వెళితే అది కొంత సర్ప్రైజింగ్ గా ఉండేదే. ఉన్నతమైన హీరో ఒక పేదోడి పెళ్లికి వెళితే నలుగురు మాట్లాడుకునేవారు. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ కూడా జనాల్లోకి వెళ్లి చేస్తాడు అనుకుంటే అలాంటి డౌన్ టు ఎర్త్ ప్లాన్స్ ఏమీ చేయడం లేదనిపిస్తోంది. అతను మళ్ళీ రిచ్ పీపుల్స్ తిరిగే ప్రదేశంలోనే ప్రమోషన్ చేస్తున్నాడు.
సిటీలోని రెస్టారెంట్స్ పబ్స్ లలో ఎక్కువగా తిరుగుతున్నాడు. మాస్ ఆడియన్స్ దగ్గరికి వెళితే రీచ్ ఎక్కువగా ఉంటుంది అనే విషయంలో ఇంకా మనోడికి ఎందుకు అర్థం కాలేదో మరి. ఏదేమైనా కృష్ణ వ్రింద విహారికి ప్రస్తుతం పెద్దగా బజ్ అయితే లేదు. విడుదలైన పాటలు కూడా వర్కౌట్ కాలేదు. ఇక చలో తరువాత నాగ శౌర్య ట్రాక్ కూడా బాగాలేదు. ఇక ఈ సినిమాను ఏ కోణంలో చూడాలి అనే ఆలోచన సదరు ఆడియెన్స్ కు ఉండకుండా ఉండదు. మరి నాగ శౌర్య రిచ్ ప్రమోషన్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.