ఎన్నో అంచనాలతో విడుదలైన సునీల్ కొత్త సినిమా కృష్ణాష్టమి... డివైడ్ టాక్ తెచ్చుకుంది. వైవిధ్యమైన సినిమాలను నిర్మించే దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. హిట్, యావరేజ్ అనే టాక్ తో పనిలేకుండా మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లను బాగానే రాబట్టింది. గతంలో సునీల్ నటించిన మర్యాదరామన్న, పూల రంగడు లాంటి సినిమాలు రాబట్టిన కలెక్షన్ల కంటే ఎక్కువగానే వసూలు చేసిందని కలెక్షన్లను బట్టి తెలుస్తోంది. మొదటి రోజు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ.2.54 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం గ్రాస్... మూడున్నర కోట్లకు పైగానే వసూలు అయిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
మొదటి రోజు దాదాపు థియేటర్లన్నీ ఫుల్ కావడంతో ఈ మాత్రం వసూళ్లు వచ్చాయని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ గా చూస్తే... నైజాం రూ.92 లక్షలు, కృష్ణా జిల్లా రూ.17 లక్షలు, వెస్ట్ రూ.21 లక్షలు, ఈస్ట్ రూ.28 లక్షలు, నెల్లూరు రూ.12 లక్షలు, గుంటూరు రూ.24 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.22 లక్షలు, సీడెడ్ రూ.38 లక్షల చొప్పున షేర్ రాబట్టగలిగాడు సునీల్. వీకెండ్ కావడం... మరో కొత్త సినిమా లేకపోవడంతో మరో రెండు రోజుల పాటు వసూళ్లు బాగానే ఉంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.