చివరికి డిజాస్టరే అయింది

Update: 2016-03-01 07:17 GMT
సినిమా మీద సరైన అంచనాలు లేవు.. పైగా పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.. అయినప్పటికీ సునీల్ కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ తొలి వీకెండ్ లో అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ.6 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో దిల్ రాజు సినిమాను ఎలాగోలా గట్టెక్కించేస్తాడులే.. బయ్యర్లను బయట పడేస్తాడులే అనుకున్నారంతా. కానీ వీకెండ్ అయ్యాక తెలిసింది సినిమా అసలు సత్తా. ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం నుంచి కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. పైగా రెండో వీకెండ్ లో ‘క్షణం’ సినిమా చాలా మంచి టాక్ తెచ్చుకుంది. ‘టెర్రర్’ కూడా జనాల్ని ఆకర్షించింది.

ఈ పోటీకి తోడు పరీక్షల సీజన్ కావడంతో ‘కృష్ణాష్టమి’ బండి నడవడం చాలా కష్టమవుతోంది. దిల్ రాజు స్టామినా కారణంగా ఇప్పటికీ చాలా థియేటర్లలో సినిమా నడుస్తోంది కానీ.. కలెక్షన్లు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ‘బుక్ మై షో’లో బుకింగ్స్ చూసినా ‘కృష్ణాష్టమి’ పరిస్థితేంటో అర్థమైపోతుంది. మొత్తానికి ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.10 కోట్ల మార్కు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే సినిమాకు దిల్ రాజు రూ.20 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు అంచనా. బృందావనం - మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలకు ఆ రోజుల్లో పెట్టిందానికంటే దీనికి ఎక్కువ ఖర్చు పెట్టానని.. ఆర్నెల్లు సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల కోటిన్నర దాకా వడ్డీ కట్టానని రాజే స్వయంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. సినిమాకు ఎంత బిజినెస్ జరిగిందన్న సంగతి క్లారిటీ లేదు కానీ.. ‘కృష్ణాష్టమి’ మీద పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం నష్టపోయిన మాత్రం వాస్తవం.
Tags:    

Similar News