పేరుకేమో కృష్ణుడు... ఫేటు కొద్దీ రాముడు - లైఫ్ టైమ్ అష్టమీ... అంటూ సందడి చేయడం మొదలెట్టాడు సునీల్. ఇంగ్లీషు - తెలుగుని బేస్ చేసుకొన్న మోడరన్ శ్రీకృష్ణుడిగా నవ్వులు పంచడానికి సిద్ధమయ్యాడాయన. సునీల్ కథానాయకుడిగా నటించిన కృష్ణాష్టమి చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేశారు. మంచి జోష్‌తో సాగే ఆ ప్రమోషనల్ సాంగ్ సినిమా గ్రాండియర్ ని కళ్లకు కడుతోంది. పక్కవాడి కష్టాల్ని కూడా తనపై వేసుకొని ఆపసోపాలు పడే వ్యక్తిగా సునీల్ నటించాడని ఆ పాట ద్వారా అర్థమవుతోంది. పాటలో చూపించిన సన్నివేశాలు చాలా కలర్ ఫుల్ - గ్రాండియర్ గా ఉన్నాయి. కామెడీ - యాక్షన్ - ఎమోషన్స్ అన్నీ పక్కాగా ఉండేలా చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గర్లానీ - డింపుల్ చోపడే కథానాయికలుగా నటించారు. వాసు వర్మ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి తర్వాత కానీ, సంక్రాంతికిగానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది.
Full View