'విజిల్ మహాలక్ష్మి' విజిల్ కొట్టించి తీరుతుందట !

Update: 2022-07-06 04:32 GMT
టాలీవుడ్ లో అందం .. అదృష్టం ఫుల్లుగా ఉన్న యంగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ముద్దుగా .. ముద్దబంతిలా కనిపించే ఈ బ్యూటీ, తెలుగు తెరపైకి అడుగుపెడుతూనే హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. నాలుగో సినిమాగా ఆమె నుంచి  రావడానికి ఇప్పుడు 'ది వారియర్' రెడీ అవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో లింగుసామి రూపొందించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి మాట్లాడింది.

" సినిమాల్లోకి రావడానికి ముందు నేను లింగుసామిగారి సినిమాలను చాలా ఇష్టంగా చూసేదానిని. ఆయన దర్శకత్వం   వహించిన 'ఆవారా' సినిమాను రోజుకి రెండుసార్లు చూసేదానిని. అలాంటి ఆయన నుంచి ఫోన్ వచ్చినప్పుడు సంతోషంతో ఎగిరిగంతేశాను.

ఈ సినిమాలో నా పాత్ర పేరు 'విజిల్ మహాలక్ష్మి' .. రేడియో జాకీగా కనిపిస్తాను. ఆడియన్స్ తో విజిల్ కొట్టించేలా ఉంటుంది. ఇక రామ్ విషయానికి వస్తే తను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఇటు రేడియో స్టేషన్ .. అటు రైల్వే స్టేషన్ కి మధ్య మా లవ్ ట్రాక్ నడుస్తుంది.

రామ్ తో సినిమా అనగానే నేను కాస్త కంగారు పడ్డాను. ఆయన ఎనర్జీ లెవెల్స్ గురించి .. డాన్సుల గురించి విన్నాను. ఆయన స్పీడ్ ను నేను మ్యాచ్ చేయగలానా? అని భయపడ్డాను. ఆయన సినిమాలు కూడా కొన్ని చూసిన తరువాతనే కెమెరా ముందుకు వెళ్లాను.

ఆయన కోపరేట్ చేయడం వలన .. ఆ ఫ్లోలో మొత్తానికి బాగా చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమా నుంచి వదిలిన 'బుల్లెట్' సాంగ్ కీ అర్బన్ నుంచి .. 'విజిల్' సాంగ్ కి మాస్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. లింగుసామిగారికీ .. నిర్మాత శ్రీనివాస్ గారికి సినిమా అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యక్షంగా చూశాను.

ఇక ఆది పినిశెట్టి గారు ఈ సినిమాలో విలన్ గా చేశారు .. మా మధ్య కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ ఆయనను నేను సెట్లో చూశాను .. ఆ తరువాత ఈ సినిమా చూశాను. బయట అంత కూల్ గా .. సాఫ్ట్ గా కనిపించే ఆయనేనా ఇంత క్రూరంగా నటించింది అని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. అలాగే నేను చేసిన పాత్ర నాకు మరింత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News